విశాఖపట్నం

తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, సెప్టెంబర్ 12: అనేక సమస్యలతోనూ.. తీవ్ర ఆర్థిక సంక్షోభంతోనూ... సతమతమవుతున్న తుమ్మపాల షుగర్స్‌ను ఆదుకుంటామని, ఈ ఫ్యాక్టరీని ఆధునీకరించి దశదిశ మార్చేస్తామని ఎన్నికల సమయంలోనూ.. ఆ తరువాత అధికారంలోకి వచ్చాక ఇక్కడి ఎమ్మెల్యే పీలా గోవింద ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానాలు కార్యరూపం దాల్చే పరిస్థితి కనుచూపుమేరలో కానరాలేదు. ఫ్యాక్టరీకి ఉజ్వల భవిష్యత్ కలగకపోగా ఉనికికే పూర్తిగా ముప్పు వాటిల్లే పరిస్థితి కల్పించేందుకు సాక్షాత్తు పాలకులే నడుం బిగించారు. ఈ ఫ్యాక్టరీకి రెండేళ్ల క్రితం చెల్లించాల్సిన చెరకు బకాయిలు మొత్తం దాదాపు రెండుకోట్ల మొత్తాన్ని ఆర్థిక తోడ్పాటుగా ఇచ్చేందుకు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆప్కాబ్ బ్యాంక్ నుండి ఫ్యాక్టరీ ఆస్తులు తనఖా పెట్టుకుని బకాయిలు మొత్తం తీరుస్తామంటే తీర్చుకోవచ్చని, మరోవైపు ప్రభుత్వమే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు 1.98లక్షల రూపాయల మొత్తాన్ని చెల్లించేందుకు సుమారు వందకోట్ల విలువైన ఫ్యాక్టరీకి చెందిన 33.35 ఎకరాల స్థలాన్ని, ఇతర ఆస్తులను ఈక్విటిబుల్ మార్టొగేజ్ చేయించడమే కాకుండా 12.05శాతం వడ్డీగా
చెల్లించేందుకు అధికారంలో ఉన్న పెద్దలు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ 50కోట్ల రూపాయల మేరకు అప్పులను వివిధ వర్గాల వారికి చెల్లించాల్సి వుంది. ఆప్కాబ్ వద్ద తాజాగా మరో రెండుకోట్ల రుణం తీసుకుంటే ఈ ఫ్యాక్టరీ తిరిగి తెరచుకునే పరిస్థితి కనుచూపుమేరలో కానరాకపోగా బహిరంగ వేలం ద్వారా ఈ ఫ్యాక్టరీ ఉనికి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఫ్యాక్టరీ ఆధునీకరణ జరుగుతుందని ఆశిస్తే రెండు సీజన్‌లుగా ఫ్యాక్టరీ మూతపడటమే కాకుండా ఈ ఫ్యాక్టరీకి చెందిన ఆస్తులు ఆప్కాబ్ బ్యాంక్ కబంద హస్తాల్లో చిక్కుకుపోయే పరిస్థితులు సన్నద్ధం కావడం పట్ల కార్మికులు, ఫ్యాక్టరీ రైతుల్లో ఒకేసారి ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మహాజన సభ ఆమోదం లేకుండా రైతుల అనుమతి పొందకుండా ఈ ఫ్యాక్టరీకి చెందిన ఆస్తులను ఆప్కాబ్‌కు తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీసి ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు ఫ్యాక్టరీ పరిధిలోని రైతులంతా సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 14న ఫ్యాక్టరీ ప్రాంగణంలో పరిరక్షణ కమిటీ వేదికగా రైతులు, కార్మికులతో విస్తృత సమావేశం ఏర్పాటుచేసి పోరుబాటకు శ్రీకారం చుడుతున్నామని ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎ.బాలకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ విల్లూరి పైడారావ, కనిశెట్టి సురేష్‌బాబు, కోరిబిల్లి శంకరరావులు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు.