విశాఖ

కొయ్యూరులో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 13: మండలంలోని సోమ, మంగళవారాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కొండవాగులు పొంగి ప్రవహించాయి. సోమవారం మధ్యాహ్నం, మంగళవారం ఉదయం వరకు మండలంలో భారీ వర్షం కురిసింది. అలాగే మంగళవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పలు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మండల కేంద్రంలో గల కొండవాగులతో పాటు శింగవరం, కాకరపాడు, నల్లగొండ తదితర ప్రాంతాల్లో కొండవాగులు పొంగి ప్రవహించాయి. శింగవరం సమీప శీలగెడ్డ పొంగి ప్రవహించడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి 12 గంటల వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల వరి పంట నీట మునిగి రైతాంగాన్ని నష్ట పరిచింది.