విశాఖపట్నం

నగరం మెరిసిపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: అర్బనైజేషన్ ఫోరంపై బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సు నగరంలో నేడు ప్రారంభం కానుంది. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ, ఎదురవుతున్న సవాళ్లు, ప్రజలకు కల్పించాల్సిన వౌలిక సదుపాయాలపై బ్రిక్స్ సభ్య దేశాలు ఈ సమావేశంలో చర్చించనున్నాయి. చైనా మినహా మిగిలిన అన్ని దేశాల నుంచి ప్రతినిధులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఎం వెంకయ్యనాయుడు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బ్రిక్స్ దేశాల సదస్సు జరగనున్న నోవాటెల్ హోటల్‌కు చేరుకుని అతిధులతో విందులో పాల్గొంటారు. అనంతరం సదస్సును ప్రారంభిస్తారు. ఇప్పటికే నగరంలో బ్రిక్స్ సదస్సు పండుగ వాతావరణం కన్పిస్తోంది. పట్టణంలోని ప్రధాన రహదార్లు, కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బీచ్ రోడ్డు సహా ఇతర దర్శనీయ స్థలాలను అందమైన విద్యుద్దీపాలతో అలంకరించారు. బ్రిక్స్ సభ్యదేశాల అతిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు 14వ తేదీ రాత్రి విందు ఇవ్వనున్నారు. కైలాసగిరిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా కైలాసగిరి సిద్ధం చేశారు. సదస్సును దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.