విశాఖపట్నం

క్రమబద్ధీకరణతో నిరుపేదలకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబర్ 23: పట్టణ పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో స్థలాలను అక్రమించుకుని భవనాలు నిర్మించుకున్న సుమారు 60 వేల మందికి మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు జీవోలను విడుదల చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పరవాడ వద్ద నిర్మించిన జెఎన్‌ఎన్‌యఆర్‌ఎంకాలనీని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పట్టణ పరిధిలో గల నిరుపేదలు ప్రభుత్వ భూమిని అక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలను చేపట్టినప్పటికీ నేటికీ వారికి పట్టాలను మంజూరు చేయలేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిరుపేదలు అక్రమించుకున్న స్థలం 100 గజాల లోపు ఉంటే 296 జీవో ఆధారంగా ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ జివో ఆధారంగా సుమారు 30వేల మంది లబ్ధిదారులకు పట్టాలు అందుతాయన్నారు. 100 గజాల పైబడి స్థలాలను అక్రమించుకున్న వ్యక్తులకు 118 జీవో ఆధారంగా నామినల్ రేట్ల ఆధారంగా క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే గాజువాక హౌస్ కమిటీ సమస్యను పరిష్కరించేందుకు 301 జివోను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ జివో ఆధారంగా సుమారు 12వేల కుటుంబాల లాభం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. సింహాచలం పంచ గ్రామాల సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమస్య ప్రస్తుతం న్యాయ స్థానంలో పరిధిలో ఉందని, న్యాయస్థానం ద్వారా సమస్యను పరిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పంచ గ్రామాల సమస్య పరిష్కరిస్తే సుమారు 12వేల కుటుంబాల లాభం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. పెదగంట్యాడ పరిధిలో గల వక్ఫ్‌బోర్డుల భూమల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఫార్మాసిటీ కాలుష్యం కారణంగా ఇబ్బంది పడుతున్న పరవాడ మండలం తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను విశాఖపట్నం తీసుకు వస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో ఉపాధిని దృష్టిలో పెట్టుకుని యువకులకు స్కిల్డ్ డవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఇండియన్ మెరిటైం యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 15 ఎంబిపిఎస్‌తో పైబర్ కేబుల్ ద్వారా కేబుల్ కనెక్షన్‌తో పాటు ఫోన్ కనెక్షన్, నెట్ కనెక్షన్ 150 రూపాయలకే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న ఆయన తెలిపారు. ఈ-పాస్ యంత్రాల ద్వారా నిత్యవసర సరుకులను ప్రజలకు అందించడంతో పాటు ప్రతీ ఒక్కరికీ ఐదు కేజీల బియ్యం అందే విధంగా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ప్రబలితున్న అంటురోగాలను దృష్టిలో పెట్టుకుని దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండేళ్ల శతశాతం మరుగుదొడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కిమిడి మృణాళిని, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద, కిడారి సర్వేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లాలం భవానీ, ఎమ్మెల్సీలు పప్పుల చలపతిరావు, గాదె శ్రీనివాసులనాయుడు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ నివాస్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ పయిల జగన్నాధరావు, టీడీపీ నాయకులు బండారు అప్పలనాయుడు, సర్పంచ్‌లు గొర్లె కనకారావు, బొద్దపు నూకరత్నం, ఎంపీటీసీ గొర్లె శ్రీనివాసరావు, పయిల సన్యాసిరాజు, బుగిడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.