విశాఖపట్నం

వారంలో కొత్త ఇసుక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: వచ్చే ఏడాది ఒకటొ తేదీ నుంచి అమలు కానున్న కొత్త ఇసుక విధానానికి సంబంధించి మరో వారం రోజుల్లో విధానాన్ని ఖరారు చేయనుంది. కొత్త విధానంలో ఇసుక టెండర్లు పిలవడం, రీచ్‌ల కేటాయింపు తదితర వాటిని అమలు చేసే బాధ్యతను గనులశాఖకు అప్పగించనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు సాధికారత కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఇసుక రేవులను (రీచ్) వారికి అప్పగించారు. అయితే స్వయం సహాయక సంఘాల ద్వారా ఇసుక విక్రయాలు జరిపినప్పటికీ ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించినప్పటికీ కృత్రిమ ఇసుక కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇసుక ధర అమాంతంగా ఆకాశాన్నంటడంతో భవన నిర్మాణదారులు తాము ఇసుకను కొనుగోలు చేయలేమని చేతులెత్తేసారు. క్రెడాయ్ సంస్థ కూడా పలుమార్లు ఇసుక ధర పెరిగిపోవడం వల్ల నిర్మాణాలు నిలిపివేశామని ప్రభుత్వానికి స్పష్టం చేశాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ఇసుక సరఫరా చేసే బాధ్యతను గతంలో మాదిరిగా గనులశాఖ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇసుక రేవులు నిర్వహించే బాధ్యతను గనులశాఖ చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మరోపక్క ఇసుక విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం స్వయం సహాయక సంఘాలకు, మరో 25 శాతం రైతు సాధికారతకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 371 ఇసుక రేవులు ఉన్నాయి. వీటన్నింటిని యూనిట్లుగా విభజించి టెండర్లు నిర్వహించనున్నారు. గనులశాఖకు ఇసుక టెండర్ల బాధ్యతను అప్పగించడం వల్ల ప్రభుత్వానికి గతంలో కంటే ఎక్కువ ఆదాయం లభించగలదని అంచనా వేస్తొన్నారు.

కార్పొరేట్ రంగంలో బిజినెస్ అనలైటిక్స్ కీలకం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 12: నేడు కార్పొరేట్ రంగంలో బిజినెస్ అనలటిక్స్ కీలకపాత్ర పోషిస్తున్నారని గీతం వైస్ ఛాన్సలర్ జి.సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం గీతంలో ఏర్పాటు చేసిన జిఎస్‌ఐబి సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలో ఉత్పత్తులు, సేవల విషయంలో నాణ్యతా ప్రమాణాలు గుర్తింపు, వినియోగదారుల స్పందన తెలుసుకునేందుకు బిజినెస్ అనలటిక్స్ ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిఎస్‌ఐబి డైరెక్టర్ ఎవి రావు మాట్లాడుతూ ఔషధ రంగంలో బిజినెస్ అనలటిక్స్ ప్రాధాన్యత క్రమేపి పెరుగుతుందన్నారు. కాగా, కొత్త మందుల పరిశోధనల ద్వారా మార్కేట్‌లోకి తేవడానికి 14 ఏళ్లు పడుతుందని ఐదు బిలియన్ డాకర్ల వ్యయం అవుతుందని చెప్పారు. ఎన్-్ఫ్యక్టోరియల్ అనలటిక్స్ సంస్థ నిపుణుడు రామన్ వైద్యనాదన్ మాట్లాడుతూ అమెరికా వంటి దేశాల్లో వినియోగదారులు టివి మీడియా నుంచి డిజిటల్ మీడియాకు మరుతున్నారని చెప్పారు. భారత్‌లో కూడా 2020 నాటికి 650 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో సదస్సు చైర్‌పర్సన్ డాక్టర్ షహజాది షేక్, డిఎక్స్‌ఐ సంస్ధ సిఐఒ సీతారాం, రస్కీ సాఫ్ట్‌వేర్ సిఇఐ చెల్లపల్లి సుధాకర్ తదితరులు ప్రసంగించారు.