విశాఖపట్నం

మేయర్ పీఠం కోసం పార్టీల వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబరు 24: జివిఎంసి ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలోగా ఎన్నికల తంతు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు జివిఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అంతర్గత కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని వైకాపా అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలను ఆదేశించారు. అంతేకాదు., జివిఎంసిలో జెండా పాతేయడానికి టిడిపి, వైకాపాలు అంతర్గత వ్యూహాలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి.
టిడిపి ఆచి తూచి అడుగేయాలి!
జివిఎంసి ఎన్నికల్లో మేయర్ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించడమే మేలని టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎదుర్కొని ఎన్నికల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఉంది. ప్రత్యేక హోదా సాధించలేకపోయిందన్న అపవాదు టిడిపిమీద ఉన్నా, హుదూద్ తుపానులో చంద్రబాబు విశాఖకు అందించిన సేవలను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని, అది ఎన్నికల్లో తమకు ఉపకరిస్తుందని టిడిపి వర్గాలు చెపుతున్నాయి. అయితే, టిడిపి, బిజెపి మిత్రపక్షాలు. ఈ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలూ కలిసి బరిలోకి దిగాల్సిందే. బలం, బలగం మాట ఎలా ఉన్నా, ఎన్నికల్లో ఇంచుమించు సగం వార్డుల నుంచి పోటీ చేయడానికి బిజెపి సిద్ధపడుతోంది. నగరంలోని పార్టీల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న అధికార పార్టీ, బిజెపికి అన్ని సీట్లు ఇస్తుందా? అన్న అనుమానాలు ఎవ్వరికైనా రావచ్చు. కొద్దిపాటి సీట్లు ఇచ్చి సరిపెట్టుకోమంటే బిజెపి అందుకు అంగీకరిస్తుందా? అనుకున్నన్ని సీట్లు దక్కించుకోపోతే సొంతంగా బలపడాలని భావిస్తున్న బిజెపి నాయకుల ఆత్మాభిమానం దెబ్బతినకా మానదు. అలాగని బిజెపి అడిగినన్ని సీట్లు ఇచ్చుకుని పోతే, సొంత పార్టీలో రెబల్స్ భారీగా పెరిగిపోయి, ఎన్నిక చిందరవందర అవుతుందని టిడిపి వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్షానే్న లేకుండా చేయాలన్న ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే, సీట్ల పంపకం విషయంలో బిజెపితో చంద్రబాబు ఆచి తూచి అడుగువేయాల్సిందే. మేయర్ ఎన్నిక ప్రరోక్షమే అయినప్పటికీ, నగరాభివృద్ధి, మాటనేర్పరి, హుందాగా ఉన్న వ్యక్తిని మేయర్ అభ్యిర్థిగా ఎంపిక చేసుకోవలిసిన అవసరం టిడిపికి ఎంతైనా ఉంది.
కమ్యూనిస్ట్‌లకు అంతంతమాత్రంగానే సీట్లు
ఇక వైకాపా కూడా జివిఎంసిలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహ రచనను శరవేగంగా చేస్తోంది. కాంగ్రెస్‌తో ఏమాత్రం స్నేహ సంబంధాలు కొనసాగించకూడదని పార్టీ శ్రేణులకు జగన్ తెగేసి చెప్పారు. అలాగే, మిత్రపక్షాలైన కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా అరడజనకు మించకుండా సీట్లను కేటాయించాలని కూడా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే, ప్రతి వార్డులోను టిడిపికి దీటైన అభ్యర్థిని పోటీకి పెట్టాలని కూడా ఆలోచన చేస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా నెగ్గినవారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి తగిన సత్తా ఉన్న వారిని మెజార్టీ వార్డుల్లో పోటీకి నిలబెట్టాలని కూడా చూస్తోంది. మేయర్‌ను నేరుగా ఎన్నుకునే పద్ధతిని కనుక అమలు చేస్తే, వైకాపా నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తగిన అర్థ బలం ఉన్న వారు పార్టీలో ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఉన్నా, అధికార పార్టీని దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగడానికి వెనకాడుతున్నారు. అదే మేయర్ ఎన్నిక పరోక్ష పద్ధతిన జరిగితే మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడానికి వైకాపా అధిష్టానం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. పార్టీకి మెజార్టీ వచ్చి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే, దాన్ని సమర్థవంతగా నడిపించే అర్హత ఉన్నవారి జాబితాను అధిష్ఠానం పరిశీలిస్తోంది. ఒకవేళ అధికారాన్ని చేపట్టకపోతే, ప్రతిపక్షంలో కూర్చుని, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే సమర్థత ఉన్న వ్యక్తులను కూడా ఎంపిక చేసుకుంటోంది. ఏదియేమైనా ఎన్నికలపై టిడిపి తీసుకోబోయే నిర్ణయం బట్టి వైకాపా వ్యూహాలను మార్చుకోవాలని చూస్తోంది.