విశాఖ

కలెక్టర్ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం మండలంలో సుడిగాలి పర్యటన జరిపి వరద ధాటికి కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు, కల్వర్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. ఉపాధ్యాయులు, గ్రామరెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గవరవరం, వెంకన్నపాలెం గ్రామాల్లోని పారిశుద్ధ్యం లోపించడం, ఎక్కడికక్కడ చెత్తాచెదారాలు దర్శనమివ్వడం, రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో ఆయా సిబ్బంది పనితీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు పరిసరాల పరిశుభ్రతపై దృష్టిసారించాలన్నారు. ప్రజలకు అంటురోగాలపై అవగాహన కల్పించాలని ఇవోఆర్‌డి ఆంజనేయులుకు సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయిన అంభేరుపురం, రాయపురాజుపేట రహదారి కల్వర్టు, గవరవరం శారదానదిపై కొట్టుకుపోయిన అప్రోచ్‌రోడ్డులను ఆయన పరిశీలించారు. ఆర్‌ఆర్ పేట కల్వర్టు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా 20లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. అలాగే గ్రామంలో నిర్మిస్తున్న సామూహిక మరుగుదొడ్లను పరిశీలించి అక్టోబర్ 2వ తేదీలోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ఈ సందర్భంలో ఎంపీటిసి సభ్యులు బొడ్డేడ రామునాయుడు, సర్పంచ్ బొడ్డేడ అచ్చియ్యమ్మ, టిడిపి మండలాధ్యక్షులు బొడ్డేడ నాగగంగాదర్‌లు గ్రామంలోని సమస్యలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో ఫారం ఫౌండ్ నిర్మాణం ఏ మేరకు జరిగింది, నాడెప్(గెత్తం) తయారీ యూనిట్లు ఏ మేరకు జరుగుతున్నది అడిగి తెలుసుకున్నారు. అలాగే గవరవరంలో కొట్టుకుపోయిన అప్రోచ్‌రోడ్డును పరిశీలించి ఆయా పరిస్థితులపై వివరాలను ఎస్‌ఇ ఆర్.నాగేశ్వరరావు, కె.మల్లికార్జునరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ పి. శ్రీ్ధర్ తదితరులను ఆయా వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద తీవ్రత తగ్గిన తరువాత అప్రోచ్ రోడ్డు నిర్మాణం పక్కాగా జరపాలని సూచించారు. తాత్కాలిక పనులు జరపడం వలన ఏటా లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయని ఇప్పటికైనా శాస్వత ప్రాతిపదికన పక్కా నిర్మాణం చేపట్టాలని సూచించారు.