విశాఖపట్నం

విధుల్లో చేరిన నర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: నర్సుల పోస్టులు ఎట్టకేలకు భర్తీ అయ్యాయి. చాలాకాలం తరువాత తొలిసారిగా ప్రభుత్వం నర్సులను నియమించింది. ఏమాత్రం సరిపడని నర్సులతో ఏ విధంగా పనిచేయించుకోవాలంటూ వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. నియామకాలు జరిపామన్న పేరుకే తప్ప వీరి సేవలు రోగులకు పూర్తిస్థాయిలో అందే పరిస్థితులైతే కనిపించడంలేదు. ఒక్క కేజిహెచ్‌లోనే దాదాపు 1500మంది నర్సుల అవసరం ఉండగా, రాష్టవ్య్రాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ కలిపి వెయ్యి మంది నర్సులను నియమించిన ప్రభుత్వం విశాఖలో కేవలం మూడు ఆసుపత్రులకే వీరిని కేటాయించింది. అదీ కేవలం 205మందిని మాత్రమే నియమించగలిగింది. ఇందులో మళ్ళీ ఘోషాసుపత్రి, ఛాతి ఆసుపత్రులకు 45 నర్సుల పోస్టులను మంజూరు చేసింది. ఈ విధంగా మిగిలిన 165 పోస్టులు మాత్రమే కేజిహెచ్‌కు దక్కాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వారంతా కలిపి 300 మంది కూడా లేకపోవడంతో మూడు షిప్టుల్లో రోగులకు సేవలందించేందుకు నిత్యం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పలు జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన నర్సులు కూడా కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. ఇందులో మళ్ళీ సెలవులపై వెళ్తుండటం, వారాంతపు సెలువులు, సిక్ అయిన నర్సులుంటున్నారు. గత కొనే్నళ్ళుగా నర్సుల పోస్టులు భర్తీ చేయలేని ప్రభుత్వం వీటిని ఇచ్చామని చెప్పుకునేందుకు 205 పోస్టులు కేటాయించి చేతులుదులుపుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా గత రెండు మాసాలుగా చేపట్టిన నర్సులపోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారా అనుభవం, ఆసక్తి కలిగి ఉండే నర్సుల నుంచి ధరఖాస్తులు స్వీకరించిన కేజిహెచ్ వైద్యాధికారులకు ఏకంగా ఐదువేలకు పైగానే ఇవి అందాయి. వీటన్నింటినీ కంప్యూటరీకరించి ప్రతిభ, అనుభవం ప్రాపతిపదికన దాదాపు రెండు వేల మందికి సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు. ఇందులో అవసరమైన 205మందిని ఎంపిక చేసి కలెక్టర్ డాక్టర్ యువరాజ్ పరిశీలించిన మీదట వీరందరికీ విధుల్లో చేరేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇందులో కొంతమంది ఇప్పటికే విధుల్లో చేరగా, మరికొంతమంది వచ్చేనెల ఒకటవ తేదీలోపు చేరుతారని కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు.