విశాఖపట్నం

జలమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, సెప్టెంబర్ 26: మం డలంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒక్కరోజులో 11 సెంటీమీటర్లు(110 మి.మీ) భారీ వర్షపాతం నమోదయింది. సోమవారం రికార్డు స్థాయిలో కురిసిన కుండపోత వర్షానికి సాగునీటి చెరువులన్నీ నిండిపోయాయి. కొన్నిచోట్ల అలుగులు నిండా ప్రవహించాయి. పల్లపు ప్రాంతాలు జలమయం కావటంతోపాటు ఖరీఫ్ వరి పొలాలు నీట మునిగాయి. జిల్లాలోని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌కు చేరే ఇన్‌ఫ్లోకు ఆధారమైన సబ్బవరం మండలంలోని ఎగువ ప్రాంతాలయిన ఎ.సిరసపల్లి నుంచి పొంగి ప్రవహించిన వరద నీటికి కాలువలు, గెడ్డలు ప్రవహించాయి. మండలంలోని ఆదిరెడ్డిపాలెం వద్ద గెడ్డపై నిర్మించిన వంతెన వరద నీటితో మునిగిపోవటంతో సుమారు 17 గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రోడ్డు వంతెన పై నుంచి కాలినడకన వెళ్ళటమే కష్టంగా మారింది. ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలను నీటి ఉద్ధృతి తగ్గేవరకు తమ సిబ్బందిని కాపలా ఉంచిన తహశీల్దార్ సత్తినాగేశ్వరరెడ్డి స్వయంగా పరిస్థితిన సమీక్షించి కొంత సేపు నిలిపివేశారు. పెదనాయుడుపాలెం, గొర్లివానిపాలెం, పెదయాతపాలెం, వంగలి,నాయనమ్మపాలెం ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఈ వరద నీరు తగ్గకపోతే వరి కుళ్ళిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఉండగా నారపాడు గ్రామంలో 8 పూరిళ్ళలోకి వరద నీరు ప్రవేశించిందని గోడలు కూలిపోయాయని ఫిర్యాదులు అందగా, పెదయాతపాలెంలోని కోనేటి అప్పలనర్సమ్మ అనే వృద్ధురాలు నివసిస్తున్న పూరిపాక గోడ కూలిపోయిందని ఆగ్రామ సర్పంచు శరగడం సాయి అన్నపూర్ణ నేరుగా తహశీల్దార్‌కు తెలిపారు. ఇక్కడి తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోలు రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తహశీల్దార్ తెలిపారు.
అచ్యుతాపురంలో
అచ్యుతాపురం: సోమవారం రెండు గంటల పాటు కుర్షిన భారీ వర్షాలకు మండలంలో చెరువులు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. చెరుకు, వరి పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో గ్రామాలన్నీ జలమయంగా మారడంతో నీలం తుపాను జ్ఞాపకాలు ప్రజలను వెంటాడుతున్నాయి. భారీ నష్టం సంభవించింది. పెదపాడు, మెలిపాక గెడ్డ ఉద్ధృత ప్రవాహం ప్రమాదంగా మారింది. ఖాజీపాలెం రోలుగెడ్డ కాలువ కట్టలు తెంచుకొని పొంగిపోర్లుతుంది. దీంతో ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులగా వర్షాలు పడతున్నప్పుటికి సోమవార కుర్షిన భారీ వర్షం కారణంగా అచ్యుతాపురం, మోసయ్యపేట, తిమ్మరాజుపేట, జగ్గన్నపేట, పెదపాడు, ఖాజీపాలెం, కొండకర్ల వంటి గ్రామాలు జలమయంగా మారాయి. సెజ్‌కు ముఖద్వారంగా ఉన్న అచ్యుతాపురం మండల కేంద్రం వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. నాలుగు రోడ్లు జంక్షన్ జలమయంగా మారింది. మండల కాంప్లెక్స్ నిండు కుండవలె మారింది. దీంతో పోలీసు స్టేషన్, ఆసుపత్రి, తహసీల్దార్, ఎంపీడీవో, డ్వాక్రా ఇతర కార్యాలయాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వాహనాలు రాకపోకలు కష్టంగా మారాయి. చోడపల్లి కాకివాని కొంపలు, మోసయ్యపేట, అచ్యుతాపురం చాకలిపేటలో వర్షం నీరు ఇంటి లోపలకు రావడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో జనసంచారం కూడ నిలిచిపోయింది. చోడపల్లి, అచ్యుతాపురం పంచాయతీలకు చెందిన అధికారులు వర్షపు నీరును కాలువల ద్వారా పంపించడానికి చర్యలు చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
పరవాడలో
పరవాడ: అల్పపీడనం కారణంగా ఎడ తెరిపి లేకుండా కురిస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించి పోయింది. గత ఐదు రోజుల ఏకదాటిగా వర్షాలు పడుతుండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సోమవారం తెల్లవారు జాము 3 నుండి 6 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మూడు గంటల వ్యవధిలోనే నాలుగు సె.మీ వర్షం నమోదు అయింది. సోమవారం సాయంత్రానికి పరవాడ మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అయితే సెప్టెంబర్ నెల 188 సెంటీమీటర్ల వర్షం అవసరం కాగా ఇప్పటి వరకు 170 సెంటీమీటర్ల వర్షపాతం నమెదు అయింది. ఈ ఏడాది అత్యధికంగా మే నెలలో అవసరమైన వర్షం కంటే అధికంగా నమోదు అయింది. సోమవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు సాగునీటి చెరువులు నిండి కుండల్లా దర్శనమిస్తున్నాయి. లంకెలపాలెం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 95లో గల తెలికల చెరువుకు వరద నీరు అత్యధికంగా వచ్చి చేరడంతో గట్టు తెగి పోయింది. దీంతో నీరంతా రైతుల పొలాల్లోకు వచ్చి చేరింది. కురిస్తున్న వర్షాలకు వరి పొలాలు నీట మునిగాయి. మెట్ట పంటల్లో భారీగా నీరు వచ్చి చేరింది. అయితే పెదస్వయభువరం గ్రామస్థులు రాకపోలు సాగించేందుకు అవకాశం లేకుండా పోయింది. గ్రామానికి అనుకుని ఉన్న రెండు గెడ్డలు సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికారణంగా రహదారి దాటేందుకు అవకాశం లేకుండా పోయింది. పెదస్వభువరం గ్రామస్థులంతా సోమవారం ఇళ్లకే పరిమితం అయ్యాయి. ఊటగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించింది. చెరువులన్నీ నిండికుండల్లా దర్శనమిచ్చాయి. తానాంలో కొండ గెడ్డలు పొంగి పొర్లాయి. కలపాక రహదారిపై నుండి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. ఒక మహిళ చిన్నారిని ఎత్తుకుని వాగు దాటేందుకు ప్రయత్నించగా వాగు లాగింది. పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు చిన్నారితో పాటు మహిళలను పట్టుకుని వాగు దాటించారు. అయితే తెలుగుదేశం పార్టీ మండల నాయకులు రొంగలి గోపాలకృష్ణ ఇంటిలో నుండి వరద నీరు సోమవారం పొంగి పొర్లింది. కళింగ గెడ్డ రైతుల పశువుల పాకలను ముంచేసింది. ఈ విషయం తెలుసుకున్న పరవాడ తహశీల్దార్ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక రైతు తహశీల్దార్ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తహశీల్దార్‌తో సదరు రైతు వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనంతరం పోలీసులు గొడవను సర్ధుమణుగు చేసి పంపారు. పరవాడ చిరికి వారి చెరువులోకి వెళ్లే మార్గాన్ని వరద నీరు కొట్టేసింది. దీంతో దారి తెగి పోయింది. పరవాడ బొండమాను చెరువు నీరంతా రైతులకు చెందిన పొలాల్లోకి వెళ్లి చేరింది. దీంతో వరి పంట నీటి మునిగింది. సాయినగర్‌కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. కలపాకకాలనీని అనుకుని ఉన్న ఖాళీ స్థలం నీటితో నిండి పోయింది.ఏకదాటిగా కురిస్తున్న వర్షాలకు ప్రజలకు అనారోగ్యం బారిన పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో జ్వర పీడతల సంఖ్య పెరిగింది. అంటువ్యాధుల ప్రబలే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వైద్యులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రహదారులపై వాహనాలను ప్రయాణించేందుకు దారి కనిపించలేని పరిస్థితి. అల్పపీడనం కారణంగా కుండ పోత వర్షం కురిసింది. పొలాలు వర్షపునీరుతో నిండి పోయాయి. కురిస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరాకు తరుచు అంతరాయం వాటిల్లితుంది. మత్స్యకారులు సైతం వేటకు వెళ్ల లేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. మత్స్యకారులు వలలు మరమ్మతులు చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అంటువ్యాధుల ప్రబలే ప్రాంతాల ప్రజలను వైద్యుశాఖ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.