విశాఖపట్నం

వేడుకగా పర్యాటక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు మంగళవారం బీచ్‌రోడ్డు రాజీవ్ స్పృతి భవన్‌లో ఘనంగా జరిగాయి. జిల్లాప్రజాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖపట్నం అందాలకు పుట్టినిల్లని, పర్యాటకులకు ఆహ్లాదాన్నిచ్చే పట్టణమన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు బిహు నృత్యం, భరతనాట్యం, మిమిక్రీ, ధింసా, తప్పెటగుళ్ళు తదితర నృత్యాలు అలరించాయి. వేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు స్టాళ్ళు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి పర్యాటక అధికారి లక్ష్మణ్, టూరిజం పదోన్నతి కమిటీ సభ్యులు శ్రీనివాసబాబు, హట్టంఘడి, హోటళ్ళ సంఘం అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.