విశాఖపట్నం

రేషన్ బియ్యం పంపిణీ గడువు 30 రోజులకు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న రేషన్ సరుకులు పంపిణీ వ్యవధిని పది రోజులకు పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునర్ పరిశీలించి నెల రోజులపాటు వీటిని పంపిణీ చేయించాలని సిపిఐ నగర కార్యవర్గసభ్యులు జి.వామనమూర్తి డిమాండ్ చేశారు. సాలిగ్రామపురం శాఖ సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం నరసింహనగర్, రైతుబజార్ వద్ద గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద,మధ్య తరగతి ప్రజలకు రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న సరుకులను తగ్గించేసి కుటుంబంలో ఒకరికి ఐదు కిలోల బియ్యం, అర కిలో చక్కెర, కిలో గోధుమలు, కిలో గోధుమపిండితో కుటుంబం అంతా ఏవ ఇధంగా బతుకుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువా మరిచారన్నారు. నాలుగు చక్రాల వాహనదారులకు రేషన్ సరుకులు నిలిపివేయాలని, గతంలో 28 రోజులు రేషన్ సరుకులు పంపిణీని నివారించేందుకు ఈ పాస్ వేలిముద్రలు, కళ్ళు తనిఖీల పేరుతో వందలాదిమంది పేదలకు వీటిని అందించకుండా తమ ద్వారా ప్రభుత్వానికి వెయ్యి కోట్లు మిగిలాయని ఆనందపడుతున్నారన్నారు. నెలకు 20 రోజులు ఇచ్చినా రేషన్ సరకులను రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత 14 రోజులకు తగ్గిస్తే జెసి ఏప్రిల్ నుంచి పది రోజులకు మాత్రమే పరిమితం చేసారన్నారు. దీనిని 30 రోజులకు పెంచాల్సిందిగా కోరారు. లేనిపక్షంలో దశలవారీ ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అడ్డూరి శంకరరావు, సాయికుమార్, వెంకటరమణ, మహాలక్ష్మి, వి.పాయల శ్రీను, నాగరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.