విశాఖ

టిడిపి హయాంలోనే కాపులకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, సెప్టెంబర్ 30: దేశం హయాంలోనే కాపులకు తగిన గుర్తింపు లభించిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో శుక్రవారం కాపుకార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముత్తంశెట్టి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేరకు కాపులకు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపుసంక్షేమ అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కాపు, బలిజ, తెలగ, వంటరి కులా ల అభివృద్ధికి అనేక పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టారని, ఈ పథకాలన్నింటిని వెనుకబడిన కాపు కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాపుకార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన కాపు, తెలగ, బలిజ, వంటరి కుటుంబాల నుండి ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు లక్ష రూపాయల సబ్సిడీతో కూడిన రుణాలను అందజేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడం గాని, ఉన్న వ్యాపారాలను విస్తరించేందుకు గాను ఆస్తులను సమకూర్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని కార్పొరేషన్ ద్వారా అందించ డం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పించేందుకు, శిక్షణలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు నెలకు ఐదువేల రూపాయలు వసతి, భోజన ఖర్చుల నిమిత్తం నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. చంద్రన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా గ్రాడ్యుయేషన్, పిహెచ్‌డి కోర్సులు విదేశాల్లో చదువుతున్న వారికి పదిలక్షల రూపాయలు రుణం అందించడం జరుగుతుందని రామాంజనేయులు తెలిపారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడు తూ కాపుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తరుపున సహాయసహకారాలు అందిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్క కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు ఐదుకోట్లు విడుదల చేయాలని చైర్మన్ రామాంజనేయులును కోరారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి శాసనసభ్యులు పంఛకర్ల రమేష్‌బాబు, చోడవరం శాసనసభ్యులు కెఎస్‌ఎన్ రాజు, పెందుర్తి శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, కాపుకార్పొరేషన్ ఎండీ అమరేంద్ర, కాపుకార్పొరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీపతి, ఆర్డీవో పద్మావతి, స్థానిక దేశం నేతలు పెంటకోట సుబ్బలక్ష్మి, మలసాల ధనమ్మ, డాక్టర్ సత్యవతి, అవంతి మహేష్, డాక్టర్ నారాయణరావు, మళ్ల సురేంద్ర, మలసాల రమణారావు తదితరులు పాల్గొన్నారు.