విశాఖపట్నం

రెండున్నరేళ్లలో విశాఖకు 2.70 లక్షల మంది వలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబరు 30: గడచిన రెండున్నర సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల 70 వేల మంది విశాఖ నగరానికి వలస వచ్చారని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్నం మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (విఎండిఎ) మాస్టర్ ప్లాన్ తయారీకి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు విశాఖ నగరాభివృద్ధి సంస్థ శుక్రవారం స్థానిక వైవిఎస్ చౌదరి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి గంటా మాట్లాడుతూ వచ్చే 50 సంవత్సరాల్లో విశాఖ ప్రజల అవరాలు, ఈ ప్రాంతా అభివృద్ధికి తగ్గట్టు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రజల ఆంకాక్షలకు తగ్గట్టుగా అభివృద్ధి జరగాలని ఇందుకు కావల్సిన బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని ఆయన కోనరారు. మాస్టర్ ప్లాన్ తయారీలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలోనే రాబోతోందని, ఇదే సమయంలో భీమిలి నుంచి విశాఖ వరకూ ఆరు లైన్ల రహదారి రూపుదిద్దుకోబోతోందని ఆయన చెప్పారు. ఐటి సిగ్నేచర్ టవర్స్, కనె్వన్షన్ సెంటర్లు, మల్టీప్లక్స్‌లు విశాఖకు తలమానికంగా నిలవబోతున్నాయని గంటా చెప్పారు.
కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి లేని నగరాన్ని ఊహించుకోలేమని అన్నారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆయన చెప్పారు. నివాసేతర ప్రాంతాల్లో అభివృద్ధి ఏవిధంగా జరగాలన్నదానిపై మాస్టర్ ప్లాన్ రూపకర్తలు దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా నగర ప్రజలకు తాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సివిల్ సొసైటీలు కీలక భూమికను పోషించాల్సి ఉందని ఆయన అన్నారు. విఎండిఎ పరిధిలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు మాట్లాడుతూ 1962లో విశాఖలో టౌన్ ప్లాన్ ట్రస్ట్ ఏర్పడిందని అన్నారు. 1978లో వుడా ఆవిర్భవించిందని తెలియచేశారు. విఎండిఎ పరిధిలో జనాభా 60 లక్షలకు పెరగనుందని ఆయన చెప్పారు. ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.
2018 ఆగస్ట్‌కు మాస్టర్ ప్లాన్
ఈ మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను స్వీకరించి లీ అసోసియేట్స్ ప్రాజెక్ట్ మేనేజర్ సతీష్‌కుమార్ దామోదర్ మాట్లాడుతూ విఎండిఎ పరిధిలో ప్రజల అవసరాలను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని అన్నారు. 20017 మార్చి నాటికి మాస్టర్ ప్లాన్ అసెస్‌మెంట్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. 2017 నవంబర్ నాటికి విజన్ అండ్ స్ట్రాటజీ ఫార్ములేషన్ రిపోర్ట్ ఇవ్వనున్నామని తెలియచేశారు. 2018 జనవరి నాటికి ప్రిలిమినరీ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రిపోర్ట్ ఇస్తామని అన్నారు. 2018 మార్చి నాటికి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అండ్ జోనల్ డవలప్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. 2018 ఆగస్ట్ నాటికి పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ అందచేస్తామని దామోదర్ తెలియచేశారు.
వుడా మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ తయారీలో నిష్ణాతులు ఉన్నారని అన్నారు. మాస్టర్ ప్లాన్ తయార చేయడంతో సరిపోదని, దాన్ని యథాతథంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మాస్టర్ ప్లాన్ సమాజ హితం కోసమని, వ్యక్తి ప్రాధాన్యత కోసం కాదని ఆయన చెప్పారు. మాస్టర్ ప్లాన్‌ను యథాతథంగా అమలు చేయకపోవడం వలనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. 30 ఏళ్ల కిందట ద్వారకానగర్ రెసిడెన్షియల్ జోన్‌గా ఉండేదని, ఇప్పుడిది కమర్షియల్ జోన్‌గా మారిందని, అప్పుడున్న వౌలిక సదుపాయలు ఇప్పుడు సరిపోవని రెహమాన్ చెప్పారు. భవిష్యత్‌లో కూడా రెసిడెన్షియల్ జోన్‌లు కమర్షియల్ జోన్‌లుగా మారితే, అవసరమయ్యే వౌలిక సదుపాయాలను ఈ మాస్టర్ ప్లాన్‌లోనే అంచనా వేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, అనిత, సిఎస్ రావు, జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు.