విశాఖ

ఘనంగా గాంధీ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 2: పట్టణంలో గాంధీజి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాంధీబొమ్మ జంక్షన్ వద్ద మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని గాంధీజి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్ముని అడుగుజాడల్లో మనమంతా పయనించాలని, నేటియువత ఆయనను ఆదర్శంగా తీసుకుని అహింశా, సత్యం, ధర్మం పాటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ కెకెవిఎ నారాయణరావు, డాక్టర్ విష్ణుమూర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడిమిశెట్టి రాంజీ, తాకాశి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మాసేవా సంఘం ఆధ్వర్యం లో మందపాటి జానకిరామరాజు కార్యాలయంలో గాంధీజి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.ఈ సందర్భంగా పేదలకు వస్తద్రానం చేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మా సేవాసంఘం నాయకులు కె.శ్రీనివాసరావు, గురజాపు శ్రీనివాసరావు, కోరుకొండ సత్యవతి, సూరిశెట్టి రమణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.