విశాఖపట్నం

ఆర్టీసీ బ్రేక్ డౌన్లతో ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: ఆర్టీసీ సిటీ సర్వీసులు తరచూ బ్రేక్ డౌన్లకు గురవుతున్నాయి. ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తుతుంది. మార్గమధ్యలో ప్రయాణికులను దింపి మరీ డిపోలకు వీటిని సరెండర్ చేస్తున్నారు. దీనివల్ల సంస్థ ఆదాయాన్ని గండి కొడుతుండగా, మరోపక్క ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. పాతపోస్ట్ఫాసు నుంచి పిఎం పాలెం మధ్య నడిచే 25పి సర్వీసు రెండు రోజుల కిందట బ్రేక్‌డౌన్‌తో నిలిచిపోయింది. ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు, బ్రేక్‌లు ఫెయిల్ కావడం, టైర్ల దెబ్బతినడం, నడుస్తున్న సిటీలు ఒక్కసారిగా నిలిచిపోవడం, మార్గ మధ్యలో మొరాయిస్తుండటం వంటివి నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఇటువంటి సమస్యలు ప్రయాణికులకు పరీక్ష పెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధులు బయలుదేరి వెళ్ళే సమయంలో నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అసలే పెరిగిపోతున్న ట్రాఫిక్, సిగ్నళ్ళ వద్ద సమయం పడుతున్న పరిస్థితులతో సిటీ సర్వీసుల సాంకేతికపరమైన సమస్యలు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య సిటీ సర్వీసులు సంబంధిత డిపోలకు వెళ్ళిపోతున్నాయి. భోజన విరామం పేరుతో డిపోలకు సరెండర్ అయ్యే సిటీ సర్వీసుల్లో వెళ్ళాల్సిన ప్రయాణికులు స్టాప్‌ల్లోనే ఉండిపోతున్నారు. వీరంతా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. సరిగ్గా ఇళ్ళకు వెళ్ళే సమయంలో ఇవన్నీ డిపోలకు వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల తప్పనసరి పరిస్థితుల్లో ఆటోలు, ప్రైవేటు వాహనాలపైన ఆధారపడుతున్నారు. మద్దిలపాలెంలో మధ్యాహ్న సమయంలో ఆర్టీసీకాంప్లెక్స్‌లో వరుసగా నిలిచిపోతున్న సిటీ సర్వీసుల వలన ఈ మార్గం మూసుకుపోతుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి మద్దిలపాలెం మీదుగా శ్రీకాకుళం, విజయనగరం, పలాస, పార్వతీపురం, సాలూరు, రాజాం తదితర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌లకు ఇవి అడ్డుగా ఉంటున్నాయి. మరోపక్క నగర శివారు ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల అవసరాలు తీరడంలేదు. అయినా అధికారులు దీనిపై దృష్టిపెట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకపోతుంది. మద్దిలపాలెం, వాల్తేరు, సింహాచలం, గాజువాక, మధురవాడ డిపోల పరిధిలో నడిచే సిటీ సర్వీసుల్లో 40 శాతం మేర కాంప్లెక్స్‌ల్లోనే భోజన విరామం సమయాల్లో ఖాళీగా పడి ఉంటున్నాయి. గత కొనే్నళ్ళుగా ఇదే విధానం కొనసాగుతుంది. అధికారులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో తెలియక ప్రయాణికులు అయోమయంలో పడుతున్నారు. అసలే చాలీచాలని సిటీ సర్వీసులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, మధ్యాహ్నం రెండు గంటలసేపు, మళ్ళీ రాత్రి 9 గంటల దాటిన తరువాత సిటీ సర్వీసుల సదుపాయం లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.