విశాఖపట్నం

20న నగరానికి సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆక్టోబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 20న విశాఖ రానున్నారు. సబ్బవరం మండలం వంగలిలో నిర్మించనున్న పెట్రోలియం వర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఆయన వెంట కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడనుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి వంగలి చేరుకుంటారు. పెట్రోలియం యూనివర్శిటీ శంకుస్థాపన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గం గుండా బయలుదేరి 12.40కి ఎయు కాన్వొకేషన్ హాల్‌కు చేరుకుని డిజిటల్ తరగతులను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి నోవాటెల్ హోటల్‌కు చేరుకుని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర కేంద్ర మంత్రులతో కలసి విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో స్వచ్ఛ భారత్‌పై నిర్మించిన షార్ట్ఫిల్మ్ స్క్రీనింగ్‌లో పాల్గొంటారు. 4.15 గంటలకు బయలుదేరి సీతమ్మధార వుడా కాంప్లెక్స్‌లో తొమ్మిది యుఎస్ ఐటి కంపెనీల కార్యకలాపాలను సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సాయంత్రం 5.40 గంటలకు పోర్టు స్టేడియంకు చేరుకుని నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను సిఎం ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు విజయవాడ బయలుదేరుతారు.