విశాఖ

ప్రైవేట్ ఆస్పత్రిలో బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), అక్టోబర్ 25: ప్రైవేట్ ఆస్పత్రిలో బాలిక మృతి చెందింది. ఆరోగ్యం బాగోలేదని తీసుకువస్తే ఏకంగా తమ పాప ప్రాణాలనే బలితీసుకున్నారంటూ బాలిక కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పట్టణంలోని పిల్లల ఆసుపత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మండలంలోని తుమ్మపాల గ్రామం చిన్నబాబు కాలనీకి చెందిన చదరం శ్రీనివాసరావు, సునీత దంపతుల కుమార్తె స్వరూప (15) సోమవారం రాత్రి వాంతులవుతుండటంతో తల్లిదండ్రులు తల్లీపిల్లల ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు బాలిక ఆరోగ్య పరిస్థితిని పరీక్షించకుండా రెండుమాత్రలు వేసి తెల్లవారు వరకు వేచి చూసే దోరణిలో వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక పరిస్థితి విషమించింది. మంగళవారం ఉదయం వైద్యులు అత్యవసరంగా ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా బాలిక స్వరూప మృతిచెందింది. బాలిక మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అదనపు డిఎంహెచ్‌ఓ రాజశేఖర్, అనకాపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ అధికారి ఎస్‌పి రవీంద్రలు సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు రాసిన మందుల చీటిలు పరిశీలించారు. బాలిక మృతిపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మృతురాలి కుటుంబ సభ్యుల హామీ ఇచ్చారు. అయినప్పటికీ మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద బైఠాయించి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ససేమిరా అంటూ నిరాకరించారు. దీంతో పట్టణ పోలీసులు ఆసుపత్రి వద్దకు వచ్చి విచారణ జరుపుతున్నారు.