విశాఖ

12 ఏళ్ల అజ్ఞాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, అక్టోబర్ 25: మండలానికి చెందిన కేశవ్ పోరాట జీవితం ముగిసింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మండలానికి చెందిన మావోయిస్టు మృతి చెందడంతో మండలం ఉలిక్కిపడింది. బెజ్జంగి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో 24 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన మావోయిస్టులలో పాంగి కేశవరావు (బిర్సు, సతీష్) జి.మాడుగుల మండలం లువ్వాసింగి పంచాయతీ తడపాలెం గ్రామానికి చెందినవారు. సుమారు 12 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన బిర్సు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించేవాడని తెలుస్తోంది. నిరక్ష్యరాసుడైన ఈయన ఉద్యమంలో ఉంటూనే చదువును నేర్చుకుని పత్రికలకు ప్రకటనలు రాసే స్థాయికి ఎదిగాడు. మావోయిస్టు పార్టీ పట్ల ఆయన నిబద్దతను గుర్తించిన పార్టీ అనతికాలంలోనే జిల్లా కమిటీలో సభ్యునిగా నియమించింది. మావోయిస్టు పార్టీలో ఇంతత్వరగా జిల్లా కమిటీలో మరెవ్వరిని తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా ఉండే బిర్సు అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా శత్రువులను ఎదుర్కొని పోరాడే సత్త వుండేదని చెప్పుకుంటారు. బిర్సు వద్ద నిత్యం ఏకే 47 తుపాకీ ఉండేదని తెలుస్తోంది. ఆదిమజాతి గిరిజన తెగకు చెదిన కేశవరావు మావోయిస్టు పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లు స్థానికులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. బిర్సు మావోయిస్టుల యాక్షన్ టీం సభ్యుడిగా కూడా పనిచేసేవాడని సమాచారం.