విశాఖపట్నం

ప్రజలతో మమేకమయ్యేందుకే జనచైతన్య యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 2: బుధవారం తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూరి మాట్లాడుతూ రైతు రుణ ఉపశమనం, డ్వాక్రా మహిళలకు మూలధనం చెల్లింపు వంటి అంశాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్‌టిఆర్ భరోసా, ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవ, చంద్రన్నబీమా, ఎస్సీ,ఎస్టీ,బిసి ఉపప్రణాళిక అమలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ల ద్వారా చేయూత వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విశాఖ నగరం విషయంలో ముఖ్యమంత్రి దీర్ఘ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇప్పటికే విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు, ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), బ్రిక్స్ సదస్సులు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపును ఇస్తున్నారన్నారు. విశాఖను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారన్నారు. భవిష్యత్‌లో విశాఖ అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా రూపొందుతుందన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ టిడిపి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉద్ఘాటించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంతకు ముందు ఎమెల్సీ మూర్తి, ఎమ్మెల్యే వాసుపల్లి దుర్గాలమ్మ గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా సభకు తరలివచ్చారు.
రాష్ట్భ్రావృద్ధే లక్ష్యం : ఎంపి ముత్తంశెట్టి
రాష్ట్భ్రావృద్ధే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తోందని అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 39వ వార్డు మాధవధారలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టారని, వీటిలో 40 శాతం పరిశ్రమలు స్థాపనకు ప్రాధమికంగా అంగీకారం కుదిరిందన్నారు. తద్వారా రాష్ట్రంలో 2 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయన్నారు. అంతకు ముందు ఎంపితో పాటు టిడిపి అర్బన్ జిల్లా కార్యదర్శి సనపల పాండురంగారావు, వార్డు టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు మాధవధార నుంచి విద్యానగర్, కళింగనగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
పోలీసు దిగ్బంధంలో విశాఖ మన్యం
పాడేరు, నవంబర్ 2: విశాఖ మన్యం పోలీసు దిగ్భందంలో చిక్కుకుంది. మన్యాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పకడ్భందీగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలోని బెజ్జంగి అటవీ ప్రాంతంలో గత నెల 24వ తేదిన జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అగ్ర శేణి మావోయిస్టులతో సహా 24 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి పాఠకులకు విధితమే. ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఈ నెల 3వ తేది గురువారం ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం మన్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించి గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. రాష్ట్ర డి.జి.పి. ఆదేశాల మేరకు మన్యంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి అణువణునా సోదా నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసు ఉన్నత అధికారులు అన్ని కోణాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసారు. ఎన్‌కౌంటర్‌లో చావు దెబ్బతిన్న మావోయిస్టులు ఎటువంటి విధ్వాంసకర సంఘటనలకు పాల్పడేందుకు వీలు లేకుండా పోలీసు అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎ.ఒ.బి.లోని మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలలో వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుగ్రామాలలో నివసించే ఆదివాసులపై మావోయిస్టుల సమాచారం కోసం ప్రశ్నలు వర్షం కురిపిస్తూ పలు విధాలుగా వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మారుమూల గ్రామాలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసు బలగాలు ప్రవేశించి సోదాలు నిర్వహిస్తుండడంతో కుగ్రామాల గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు మారుమూల గ్రామాలలో జల్లెడ పడుతున్న పోలీసులు ప్రధాన మార్గాలలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో ప్రతి మార్గంలో పోలీసు బలగాలు పహరా కాస్తూ వాహనాల తనిఖీలను ముమ్మరం చేసారు. రహదారులపై ప్రయాణిస్తున్న అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా సోదా చేసి వాహనాలలో ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ వాహనం ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది వంటి అంశాలను పోలీసులు ఆరా తీస్తుడడమే కాకుండా వాహనదారులు వెళుతున్న ప్రదేశాలకు ఎందుకు వెళుతున్నారనే దానిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏజెన్సీలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో పోలీసులే దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఏజెన్సీలోని ప్రభుత్వ కార్యాలయాలపై మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసు భద్రతను పటిష్టం చేసారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రి వేళల నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహిస్తూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు మన్యంలోని ప్రజా ప్రతినిధులకు, ముఖ్యమైన రాజకీయ నాయకులకు మావోయిస్టుల నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీసు అధికారులు ఇప్పటికే వారిని అప్రమత్తం చేసి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేసారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు మావోల నుంచి ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న పోలీసు అధికారులు వారి పట్ల మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలతో ఇప్పటికే ఏజెన్సీలోని కొందరు నాయకులు మైదాన ప్రాంతాలకు తరలివెళ్లిపోగా ఈ ప్రాంతంలోనే ఉన్న మరికొంత మంది నాయకులు మాత్రం తమను తాము రక్షించుకునేందుకు పోలీసుల సూచనల మేరకు పలు విధానాలను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా బంద్ మావోయిస్టులు తలపెట్టిన బంద్ దృష్ట్యా పోలీసు వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అన్ని ముందు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు. మావోల బంద్‌ను విఫలం చేసేందుకు, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనకు తావులేకుండా చర్యలు చేపట్టారు. మావోల బంద్ పిలుపుకు ఎవరు స్పందించరాదని, వ్యాపారులు తమ దుకాణాలను తెరిచి ఎప్పటివలే వ్యాపార లావాదేవీలను కొనసాగించాలని పోలీసు అధికారులు ఈ ప్రాంత వ్యాపారులకు హుకుం జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారుల ఆదేశాలు, హెచ్చరికలతో మన్యంలోని వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. పోలీసుల హెచ్చరికలతో తాము దుకాణాలు తెరిస్తే మావోయిస్టుల నుంచి ఎటువంటి ప్రమాదం సంబవిస్తుందోనని, దుకాణాలు తెరవకపోతే పోలీసులు తమపై ఏం చర్యలు తీసుకుంటారోనని మన్యం వ్యాపారులు ఆందోళన చెందుతూ తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల బంద్ పిలుపుకు వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని అంటున్నారు. ఏదిఎమైనా మవోల బంద్ పిలుపుతో మరింత అప్రమత్తమైన పోలీసు వర్గాలు మన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపడుతుండడంతో ఎప్పుడు ఎక్కడ మళ్లీ ఏం జరుగుతుందోనని ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తుంది.
పోలీస్‌స్టేషన్లు, ప్రజాప్రతినిధులే టార్గెట్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 2: మావోయిస్ట్ ఇచ్చిన బంద్ పిలుపు అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గత నెల 24న బెజ్జంగి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్ట్‌లు హతమైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారీ విధ్వంసానికి మావోయిస్ట్‌లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్న ఊహాగానాలు వెలువడడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బెజ్జంగి ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పోలీసులను ఆయుధంగా ఉపయోగించుకుని, నిరాయుధులైన మావోయిస్ట్‌లను కిరాతంగా హతమార్చారని దళ నేతలు పేర్కొంటున్నారు. దీంతో ప్రజా ప్రతినిధులు, పోలీసులు, పోలీస్ స్టేషనే్ల లక్ష్యంగా మావోయిస్ట్‌లు విధ్వంసానికి పాల్పడతారన్న కథనాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీతోడు బెజ్జంగి ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్‌లో మావోల హిట్ లిస్ట్‌లో సుమారు 20 మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో సీలేరు, అన్నవరం పోలీస్ స్టేషన్లను మావోయిస్ట్‌లు పేల్చేసిన ఘటనలు ఉన్నాయి. అలాగే ఏఓబిలోని మరికొన్ని పోలీస్ స్టేషన్లను పేల్చి వేస్తామని మావోయిస్ట్‌లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీస్ స్టేషన