విశాఖపట్నం

పట్టించుకోని పట్ట్భద్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వచ్చే ఏడాది మార్చిలో పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో ఓట్ల నమోదు ఓ ప్రహసనంగా మారింది. ఓట్ల నమోదుకు పట్ట్భద్రులు ఏమాత్రం పట్టించుకోపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎవ్వరికీ ఆసక్తి లేకపోవడం కూడా ఓటర్ల నమోదు నత్తనడక నవడానికి ఒక కారణమని చెపుతున్నారు. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికలపై అటు రాజకీయ పార్టీలు, ఇటు ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. 2007లో పట్ట్భద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కలిపి సుమారు 1,20,000 ఓట్లు నమోదైనాయి. 2011 ఎన్నికల్లో ఆ ఓట్లనే కొనసాగిస్తూ కొత్త ఓటర్లను చేర్చుకోవడంతో ఈ సంఖ్య సుమారు 1,62,000కు చేరుకుంది. 2017లో జరగనున్న ఎన్నికలకు పాత ఓటర్లు పనికిరారంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో కొత్త ఓటర్లను చేర్చుకోవలసి వస్తోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో కలిపి కేవలం 48,835 మంది ఓటర్లు మాత్రమే తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 9,491 మంది, విజయనగరం జిల్లాలో 7,901 మంది, విశాఖ జిల్లాలో 31,443 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2011తో పోల్చి చూస్తే నమోదైన ఈ ఏడాది ఓట్ల నమోదు సంఖ్య పెరిగిందని రాజకీయ వర్గాలు చెపుతున్నా, పట్ట్భద్రుల సంఖ్య కూడా అంతకు మించే పెరిగిందన్న విషయాన్ని వారు గుర్తించాలి. ఓట్ల నమోదు ఇంత దారుణంగా జరగడానికి పలు కారణాలున్నాయి.
* ఎమ్మెల్సీ ఎన్నికలపై పట్ట్భద్రుల్లో చాలా మందికి ఆసక్తి లేదు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు ఏంచేస్తారులే! అన్న భావన చాలామందిలో ఉంది.
* చాలా మంది పట్ట్భద్రులు తమ ప్రొవిజినల్ డిగ్రీ సర్ట్ఫికెట్లను తీసుకోలేదు. ఇప్పుడు యూనివర్శిటీలకు వెళ్లి అపరాథ రుసుము చెల్లించి వాటిని తీసుకోవాలి. ఆ సర్ట్ఫికెట్‌ను తీసుకుని నమోదు ప్రక్రియకు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకు పట్ట్భద్రులు ఆసక్తి చూపడం లేదు.
* ఆన్‌లైన్‌లో ఓట్లను నమోదు చేయించుకుందామంటే, వెబ్‌సైట్ చాలా స్లోగా ఉంటోంది. గంటల తరబడి కూర్చుని అప్లికేషన్లను అప్‌లోడ్ చేసినా రోజుకు 20 నుంచి 30కి మించి అవడం లేదు.
* ఓట్ల నమోదుకు ప్రభుత్వ సిబ్బంది కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ప్రచారం లేకపోవడం కూడా అనుకున్న స్థాయిలో నమోదు ప్రక్రియ జరగలేదు. గత రెండు పర్యాయాలు పట్ట్భద్రుల నియోజకవర్గానికి రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థులను రంగంలో దించేందుకు ఉత్సాహాన్ని కనబరిచాయి. కానీ, ఈ ఎన్నికని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ప్రోగ్రెసివ్ డెమెక్రటివ్ ఫ్రంట్ (పిడిఎఫ్) తనకున్న ఓటు బ్యాంకు చెదిరిపోకుండా జాగ్రత్త పడుతోంది. సుమారు 200 ప్రజా సంఘాల్లోని పట్ట్భద్రులను ఓటర్లుగా చేర్పించడంలో ఇప్పటికే ఆ పార్టీ ముందంజలో ఉంది.
ఈ ఎన్నికల్లో ఏవిధంగానైనా విజయం సాధించాలని తెలుగుదేశం గట్టిపట్టు పట్టి తనకున్న ‘కాలేజీ’ బలాన్ని ఉపయోగిస్తోంది. పార్టీల సమీకరణల నేపథ్యంలో తమ పార్టీకి టిక్కెట్ వస్తే, ఎన్నికల్లో దూసుకుపోవాలన్న ఉద్దేశంతో బిజెపికి కూడా ఓటర్ల నమోదు ప్రక్రియను శక్తివంచన లేకుండా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన మూడు జిల్లాల్లో ఓట్ల నమోద కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా అయితే, ఈ ఎన్నికల సోదిలోనే కనిపించడం లేదు. ఓట్ల నమోదుకు కేవలం 48 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఈ సమయంలో భారీగా ఓట్లు నమోదయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
అదనపు సిబ్బంది:ఇన్‌చార్జ్ కలెక్టర్
ఇదిలా ఉండగా ఓట్ల నమోదు శాతం చాలా తక్కువగా ఉండడంతో విశాఖ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ బాబూరావు నాయుడు స్పందించి నాలుగు, ఐదు తేదీల్లో అదనపు సిబ్బందిని నియమించి, ప్రభుత్వ రంగ సంస్థలకు పంపించనున్నారు. ఓటర్ల నమోదుకు మరికొంత సమయాన్ని కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దానిపై ఇంకా ప్రకటన రాలేదని బాబూరావు నాయుడు చెప్పారు.