విశాఖపట్నం

ఎఇఇ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 3: పోలీస్ కానిస్టేబుళ్లు, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 6 ఆదివారం జరగనున్న పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పి.చంద్రశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్ష నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టస్థ్రాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే కానిస్టేబుళ్ల పరీక్షలకు 46,395 మంది అభ్యర్థులు, ఏపిపిఎస్ ఆధ్వర్యంలో సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలకు 7,748 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షలకు 76 కేంద్రాలు, ఇంజనీర్ల పరీక్షలకు 16 కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పోటీ పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 వరకు జరుగుతాయన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకు ప్రాంతీయ సమన్వయ అధికారిగా ఆచార్య కె.వెంకట సుబ్బయ్య వ్యవహరిస్తుండగా సమన్వయ పర్యవేక్షణ అధికారిగా తాను వ్యవహరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఏపిపిఎస్ ప్రశ్నపత్రాలను కలెక్టరేట్ స్ట్రాంగ్ రూమ్‌లో, పోలీస్ కానిస్టేబుళ్ల ప్రశ్నపత్రాలను ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనున్న స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తున్నందున స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాల రవాణాకు ఎస్కార్టులుగా అవసరమైన్ పోలీసు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలుపరచాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో హాజరయ్యేందుకు వీలుగా పరీక్షలు జరిగే రోజు ఉదయం తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాల పంపిణీకి, ఫ్లయింగ్ స్క్వాడ్లకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత లేకుండా చూడాలని, తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో ఏఎన్‌ఎమ్ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు.
అరగంట ముందుగా
పరీక్షలకు హాజరు కావాలి
రాష్టస్థ్రాయి పోలీస్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే కానిస్టేబుళ్ల పరీక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని, నిర్ణీత సమయానికి అరగంట ముందుగా అభ్యర్థులు సంబంధిత కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ప్రాంతీయ సమన్వయ అధికారి ఆచార్య కె. వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈసారి ఏమాత్రం గ్రేస్ టైమ్ ఉండబోదని అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంటుందన్నారు. బయోమెట్రిక్ మస్తరు విధానాన్ని అమలు చేస్తున్నందున అభ్యర్థులు అరగంట ముందు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో హాజరు కావలసి ఉందన్నారు. రిస్టువాచ్‌తో పాటు కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ ఉప కరణాలు తదితర వాటిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని, ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుందన్నారు. జివిఎంసి అదనపు కమిషనర్ మూర్తి, అదనపు పోలీస్ కమిషనర్ ఎఎస్ ఖాన్, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, విద్యుత్ శాఖ ఏడిఇ ఏ.అనంతరావు, ఆరోగ్యశాఖ నోడల్ అధికారి డా.సిహెచ్ శ్రీ్ధర్, కలెక్టరేట్ డి-సెక్షన్ పర్యవేక్షకులు రత్నం ఈ సమావేశంలో పాల్గొన్నారు.