విశాఖపట్నం

విస్తృతంగా పట్ట్భద్రుల ఓటర్ల నమోదు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 3: పట్ట్భద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 5లోపు తీసుకోవాల్సిందిగా ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అధిక మొత్తంలో పట్ట్భద్రుల ఓటర్ల నమోదును చేపట్టాలన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. పోలింగ్ ప్రపోజల్స్‌ను ఈ నెల 10 లోపు అందచేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 19 నాటికి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్‌ను తయారు చేయాలన్నారు. నవంబర్ 23 నాటికి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇవ్వాలన్నారు. డిసెంబర్ 8లోపు క్లెయిమ్స్, అభ్యంతరాలను తీసుకుని డిసెంబర్ 26లోపు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 30న ఎలక్టోరల్ రోల్స్ ఫైనల్ పబ్లికేషన్‌ను ప్రచురించాలన్నారు. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, యూనివర్సిటీలకు చెందిన ప్రధాన అధికారులతోను, పొలిటికల్ పార్టీల ప్రతినిధులతోను సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్ట్భద్రుల ఓటర్ల నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ బాబురావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో నేటి వరకు 22,162 దరఖాస్తులు భౌతికంగాను, 9,281 దరఖాస్తులు ఇ-రిజిస్ట్రేషన్ ద్వారాను మొత్తం 31,443 దరఖాస్తులు వచ్చాయన్నారు. అన్ని పరిశ్రమలు, సంస్థలకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులను ఓటర్ల సమోదుకు నియమించడం జరిగిందన్నారు. 5వ తేదీ లోపు అధిక మొత్తంలో పట్ట్భద్రుల ఓటర్ల నమోదు శాతాన్ని పెంచడానికి తగు చర్యలు చేపడతామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి డి.చంద్రశేఖరరెడ్డి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ మూర్తి పాల్గొన్నారు.