విశాఖపట్నం

జగన్ సభకు వెళ్లొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రత్యేక హోదా సాధన కోసం స్థానిక మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జగన్ తలపెట్టిన బహిరంగ సభకు ఎవ్వరూ వెళ్లద్దని అధికార పార్టీ హుకుం జారీ చేసింది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలపై ఆంక్షలు విధించినట్టు విశ్వసనీయ సమాచారం. హోదా విషయంలో కేంద్రం తాను అనుకున్నదే అమలు చేసింది. హోదాకు బదులు తత్ సమాన ప్యాకేజీని ఇచ్చింది. ఇచ్చిందాన్ని తీసుకోపోతే ఇబ్బందిపడతామన్న ఉద్దేశంతో సిఎం చంద్రబాబు కూడా ఇచ్చిందాంతో సరిపెట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన రాజీతో అప్పటి వరకూ ప్రత్యేక హోదాపై గళమెత్తిన ఉద్యోగ, ప్రజా సంఘాలు ఉద్యమ చాపను చుట్టేశారు. దీంతో ఇప్పుడు ప్రజల్లో ప్రత్యేక హోదా చర్చే జరగడం లేదు. కానీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం హోదాపై తాను చేస్తున్న ఉద్యమానికి కొత్త రూపమిచ్చి మళ్లీ జనాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. జగన్ చేస్తున్న ఉద్యమానికి జనం రాకపోతే ఇబ్బందే మరి! ఆ వీక్ పాయింట్‌ను అధికార పార్టీ తురుపు ముక్కలా వాడుకుంటోంది. జగన్ సభకు జనమే లేకుండా చేస్తే, హోదా ఉద్యమం దానంతట అదే చల్లారిపోతుందని అధికార పార్టీ భావించింది. వచ్చిన ఆలోచనను వెంటనే అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం నిర్వహించే సభలు కళకళలాడ్డానికి కారణం డ్వాక్రా మహిళలు. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో ఇంతింతై వటుడింతై అని ఎదుగుతున్న డ్వాక్రా మహిళలపై అధికార పార్టీ ముందుగా దృష్టి పెట్టింది. జగన్ సభ జరిగే పరిసరాలకు వెళ్లద్దంటూ సంబంధిత అధికారుల ద్వారా వర్తమానం పంపించింది. దీంతో డ్వాక్రా మహిళలు మున్సిపల్ ఆదివారం అడుగు పెట్టడానికి అవకాశం లేకుండాపోయింది. అలాగే, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమతమ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన ఎవ్వరూ జగన్ సభవైపు కనె్నత్తి చూడద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక జగన్‌పైనో, పార్టీపైనో అభిమానం ఉండి, వెళ్లాలనుకున్న వారిని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనె్నర్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సభకు వెళితే, భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు వచ్చినా, పరిష్కరించమంటూ హెచ్చరించి, వారిని కూడా కట్టడి చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఆంక్షల నేపథ్యంలో ఒక్కో వార్డు నుంచి 200 నుంచి 300 మంది కార్యకర్తలను తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడి పరిస్థితిని గమనించిన పార్టీ అగ్రనాయకులు పక్క జిల్లాల నుంచి జనాన్ని రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు.

పుట్టినరోజునాడే మృత్యు ఒడిలోకి
సింహాచలం, నవంబర్ 4 : స్నేహితులు, చుట్టాలతో కలసి వేడుక చేసుకుంటానని వెళ్ళిన కొడుకు మృతుడై తిరిగి వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. అడివిరంలో నివాసముంటున్న పంచదార్ల స్వామినాయుడు, రామలక్ష్మీ దంపతుల కుమారుడు స్వరూప్ కుమార్‌యాదవ్ (20) ఎంవిజిఆర్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం పుట్టిరోజు కావడంతో గురువారం రాత్రి స్నేహితులతో కలసి వేడుకలు చేసుకునేందుకు నగరంలోకి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో వాహనంపై వెళుతున్న స్వరూప్ ఉడా పార్కు వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు. స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళారు. ప్రమాదానికి గురైన స్వరూప్‌ని కెజిహెచ్‌కి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇరవై ఏళ్ళకే నూరేళ్ళూ నిండిపోయాయా.. అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. శుక్రవారం మృతదేహాన్ని అడివివరం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.