విశాఖపట్నం

తప్పని సరి చర్యలు ఇవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 7: రైతు సంక్షేమమే లక్ష్యంగా ఆచార్య ఎన్‌జి రంగా ఎనలేని కృషి చేశారని మాజీ ముఖ్యమంత్రి కె రోశయ్య అన్నారు. వెలువోలు ట్రస్టు ఆధ్వర్యంలో ఎయు అంబేద్కర్ అసెంబ్లీ హాల్‌లో సోమవారం జరిగిన ఆచార్య రంగా 116వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రోశయ్య మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారన్నారు. సంపన్న రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ, వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతు కుటుంబాల్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకే తన జీవితాన్ని వెచ్చించారన్నారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఉత్పత్తి పెంచుకునే విధంగా అనేక చర్యలకు రంగా శ్రీకారం చుట్టారన్నారు. రైతుల కోసమే కాకుండా చేతి వృత్తులు, చేనేత కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలను రంగా చేపట్టారన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో పట్టాతీసుకున్న రంగా తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పదవులకోసం ఆరాటపడలేదన్నారు. ముఖ్యంగా పేద రైతుల పక్షాన పోరాడే తత్వంతో కేంద్రంలో కేబినెట్ పదవిని సైతం వద్దని, ఎంపిగా ఉంటేనే రైతుల తరపున గళం విన్పించగలనని భావించిన రాజకీయ ఆదర్శవాదిగా ఆచార్య రంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఆచార్య రంగా గొప్ప మానవతా వాదిగా ఈ దేశం గుర్తుంచుకుంటుందన్నారు. రైతుల సంక్షేమం కోసం నిస్వార్ధంగా సేవలందించిన గొప్ప రాజకీయ వాదిగా ఆయన నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ దశాబ్ధాలు గడుస్తున్నా రైతు సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు మారినా, రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా వారి కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయని, గిట్టుబాటు ధరలు దక్కించుకోలేని పరిస్థితుల్లో రైతులు నిస్సహాయంగా ఉన్నారన్నారు. ఉత్పత్తి పెరిగిందని, సాగు విస్తీర్ణం పెరిగిందని, అయినా రైతు సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని, దీనికి గల కారణాలు అనే్వషించి, రైతుకు మేలు చేకూరే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సిసిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ మానవ వ్యవస్థను నడిపే రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయన్నారు. సంపద, వనరులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నప్పటికీ అభివృద్ధి సాధ్యం కావట్లేదంటే అందుకు బలమైన రాజకీయ వ్యవస్ధ లేకపోవడమేనన్నారు. చట్టసభల్లో 80 శాతం గ్రామీణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే ఉన్నప్పటికీ రైతుల కోసం ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదన్నారు. ప్రజాప్రతినిధులు కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరే చట్టాల రూపకల్పనకే ప్రాధాన్యమివ్వడం వల్ల దేశంలో రైతు సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదని అభిప్రాయపడ్డారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మాట్లాడుతూ స్పష్టమైన అవగాహనతో ఆచార్య రంగా రైతు సమస్యలపై రాజీలేని పోరు చేశారన్నారు. భారత రాజ్యాంగానికి అంబేద్కర్ పేరును సూచించి రాజకీయ విలువలు పాటించిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు మాట్లాడుతూ నాటి, నేటి తరాల మధ్య వ్యవసాయ సంస్కరణలకు బీజం వేసింది ఆచార్య రంగా ఒక్కరేనని అన్నారు. రైతు సమస్యల్లో ఉంటే దేశమే అల్లాడుతుందని, అటువంటి రైతు సమస్యలపై ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాయూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి ఉమామహేశ్వరరావు, వెలువోలు ట్రస్టు ప్రతినిధి బసవపున్నయ్య, భోగినేని సుబ్బారావు చౌదరి, సనపల పాండురంగారావు, తదితరులు పాల్గొన్నారు. ‚

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అనకాపల్లి(నెహ్రూచౌక్), నవంబర్ 7: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు సమస్యలు నేరుగాప్రజాప్రతినిధులు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఈ జన చైతన్యయాత్రలు దోహదపడతాయని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. జన చైతన్యయాత్రలో భాగంగా సోమవారం గవరపాలెంలో 19, 26, 27 వార్డులుతోపాటు మండలంలోని కొండుపాలెం, పాపయ్యపాలెం, పాపయ్యసంతపాలం, మామిడిపాలంలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సందర్శించారు. సంతోషి మాత కోవెల సమీపం లో ఉన్న మంచినీటి ట్యాంకును, డ్రైనేజీ కాలువలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందాలన్నారు. అలాగే ప్రభుత్వం నుండి వచ్చిని ప్రతీ పైసా ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్నారు. అలాగే మండలంలోని కొండుపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజులు స్వచ్ఛమైన తాగునీరు, సిసిరోడ్లు, డ్రైనేజీ తదితర వౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఇంటి పరిశుభ్రతతోపాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో దేశం నాయకులు బుద్ద నాగజగదీష్, మళ్ళ సురేంద్ర, బొలిశెట్టి శ్రీనువాసరావు, బిఎస్‌ఎంకె జోగినాయుడు, డా విష్ణుమూర్తి, కొణతాల శ్రీనువాసరావు, కొండుపాలెం ఎంపిటిసి శెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.