విశాఖపట్నం

అయిదు లక్షల పక్కా గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, నవంబర్ 7: రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఐదు లక్షల పక్కా గృహాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంజూరు చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణానికి కేవలం 70 వేల రూపాయలు మాత్రమే మంజూ రు చేసేవారన్నారు. ఈ నిధులు ఇంటి నిర్మాణానికి ఏమాత్రం చాలవనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి లక్షా 50 వేలరూపాయలకు పెంపుదల చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ళకు రెండు లక్షలు కేటాయిస్తున్నారని, ఈమొత్తంలో లబ్ధిదారుడు 8,740 రూపాయలు
డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 లక్షల ఇళ్ళు మంజూరు చేయగా,తమ దర్యాప్తులో కేవలం 25 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మాణం చేసినట్లు వెల్లడైందన్నారు. ఈపరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పా ట్లు చేసిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిపే విధంగా చర్యలు చేపట్టారన్నారు. నిర్మాణ సామగ్రిని, నిర్మాణ వ్యయా న్ని ప్రభుత్వమే పర్యవేక్షిస్తూ ఖర్చు చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్మాణం పని వ్యయాన్ని చెల్లిస్తారన్నారు. అధికారుల సూచన మేరకు లబ్ధిదారుడు సామగ్రిని సమకూర్చుకోవడం,నిర్మాణ పనులు చేయించుకోవడం చేయాలన్నారు. గతంలో చెక్కులు, చెల్లింపు పద్ధతులు సక్రమంగా పనులు జరుగక నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. నర్సీపట్నం నియోజకవర్గానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 1,250 ఇళ్ళు, కేంద్ర ప్రభుత్వ పథకం కింద 289 ఇళ్ళు మంజూరయ్యాయన్నారు. స్థలం ఉన్న వారికే ఇల్లు మంజూరు చేస్తారన్నారు. బినామీల ప్రమేయం లేకుండా బిల్లులు చెల్లించేలా ఆన్‌లైన్ విధానం ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. గృహ నిర్మాణ పథక సంచాలకులు జి.వి. ప్రసా ద్ గృహ నిర్మాణ పథక వివరాలను వివరించారు. లబ్ధిదారులైన మహిళలకు మంత్రి గృహ పత్రాలను అందించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.సూర్యారావు, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ మండలాల ఎం.పి.పి.లు, జెడ్పిటిసిలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, గృహ నిర్మాణ సంస్థ డిఇ జోగారావు, ఎఇలు పాల్గొన్నారు.