విశాఖపట్నం

సింహాచలేశుని పూలతోటకు హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 8 :చారిత్రక ప్రాధాన్యత గల శ్రీ వరాహలక్షీనృసింహస్వామి వారి దేవస్థానం పూలతోటను విశాఖ సెంట్రల్ పార్క్ తరహాలో అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో జి వి ఎం సి 60 జోన్ కమిషనర్ ఎన్. శివాజీ, ఇ ఇ వేణుగోపాల్ మంగళవారం దేవస్థానానికి వచ్చి ఈవో రామంచంద్రమోహన్, డి ఇ మలేశ్వరరావుతో కలిసి పూలతోటను సందర్శించారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూలతోటను అధికారులు పరిశీలించారు. ఎడాదిలో రెండు పర్యాయాలు సింహాచలేశుడు ఉత్సవాల నిమిత్తం పూలతోటకు వచ్చే సంప్రదాయం ఉన్న నేపథ్యంలో సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, అలనాటి కట్టడాలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించినట్లు అధికారులు తెలియజేసారు. తోటలో పచ్చదనంతో పాటు దేవాలయానికి అవసరమైన పూల సాగుకు సంబంధంచి ప్రత్యేకంగా దృష్టిపెట్టామని దేవస్థానం అధికారులు జి వి ఎం సి అధికారులుకు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ నగర సుందరీకరణ అభివృద్ధి సంస్థకు చెందిన ప్రతినిధులు పూలతోట అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారని దేవస్థానం అధికారులు తెలియజేసారు. ఈ నపథ్యంలో పూలతోటను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసే బాధ్యతలను విశాఖ నగరాభివృద్ధి సంస్థకు అప్పగించాలా? జి వి ఎం సి చేయాలా? దేవస్థానం, ఉడా, జి వి ఎం సి సంయుక్తంగా చేయాలా? అన్నదాని పై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవలసి ఉందని అధికారులు చెప్పారు.
* శ్మశాన వాటిక దారి మార్పుకు చర్యలు
అడివివరం స్మశాన వాటిక రహదారి మార్పు చేయాలని గ్రామస్తులు ఎప్పటి నుండో అధికారులకు మొరపెట్టుకుంటున్న నేపధ్యంలో జి వి ఎం సి అధికారులు మంగళవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. దేవస్థానం డి ఇ మల్లేశ్వరరావు, స్థానిక టిడిపి నేతలు పాశర్ల ప్రసాద్, పి వి.నరసింహం ఇక్కడి పరిస్థితిని జోనల్ కమిషనర్ శివాజీ, ఇ ఇ వేణుగోపాల్‌కి వివరించారు. పుష్కరిణీకి పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా, పవిత్రత దెబ్బతినకుండా రహదారిని మార్పు చేసే అంశం పై అధికారులు చర్చించారు. పుష్కరిణీ అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో స్మశాన వాటిక రహదారి మార్పుచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.