విశాఖపట్నం

చిల్లర నోట్ల పంపిణీకి మినీ ఎటిఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: నగరంలో ఎటిఎం కేంద్రాల్లో ఆశించిన మేర నగదు లభ్యం కాని ఖాతాదారులకు ఇది నిజంగా శుభవార్తే. చిన్న నోట్లను విస్తృతంగా పంపిణీ చేసేందుకు అన్ని ఎస్‌బిఐ కేంద్రాల వద్ద పిఓఎస్ మెషీన్లను ఏర్పాటు చేశారు. మినీ ఎటిఎంల పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉండగా, నగరంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎస్‌బిఐ శాఖల వద్ద వీటిని ఏర్పాటు చేశా రు. ఈ సేవలన్నీ ప్రైవేటు ఏజెన్సీ పసుమర్తి రిటైల్ ఎల్‌ఎల్‌పి ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. మినీ ఎటిఎం కేంద్రాల ద్వారా రూ.100, రూ.50, రూ.20 నోట్లను పంపిణీ చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. లోకల్ కార్డులపై రూ.1000 వరకూ, నాన్ లోకల్ కార్డులపై రూ.2000 వరకూ చిన్న నోట్లు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో రూ.500 నోట్లను కూడా త్వరలోనే మినీ ఎటిఎంల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.