విశాఖపట్నం

ఎగరని హెలీ టూరిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: పర్యాటకాభివృద్ధి చర్యల్లో భాగంగా విశాఖ నగరం నుంచి హెలీ టూరిజం ఏర్పాటు చేయాలని యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి ఆదిలోనే అవాంతరం ఎదురైంది. విశాఖ నగరం నుంచి కైలాసగిరి, భీమిలి, అరకు అందాలకు విహంగ వీక్షణ ద్వారా వీక్షించే విధంగా హెలీ టూరి జం ఏర్పాటు చేయాలని భావించారు. దీనికోసం స్కై చోపర్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా వుడా పార్కులో హెలిపాడ్‌ను వుడా సొంత నిధులతో నిర్మించింది. దీనికోసం వుడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అన్నీ పూర్తి చేసుకున్న తరుణంలో స్కై చోపర్స్ సంస్థ హెలీ టూరిజానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నుంచి అనుమతులు తీసుకోవడంలో విఫలమైంది. విశాఖ నుంచి హెలి టూరిజం గత నెల దసరా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే డిజిసిఎ నుంచి అనుమతులు తీసుకోవడంలో స్కై చోపర్స్ సంస్థ విఫలం కావడంతో దసరా నుంచి ప్రారంభం కావాల్సిన హెలీ టూరిజం అటకెక్కింది. దీంతో వుడా స్కై చోపర్స్ లాజిస్టిక్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇప్పటికే వుడా పార్కులో హెలిపాడ్ నిర్మించిన వుడా ఇప్పుడు కొత్త సంస్థ కోసం అనే్వషిస్తోంది. గతంలో మాదిరి కాకుండా పేరున్న సంస్థతో ఈ సారి ఒప్పందం కుదుర్చుకునే దిశగా వుడా ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగా మినీరత్నం హోదా కలిగిన పవన్ హేండ్స్ లిమిటెడ్ సంస్థతో వుడా సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిసింది. వచ్చే జనవరి నాటికైనా హెలీ టూరిజం ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్న వుడా ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందనే చెప్పాలి.