విశాఖ

ఆర్‌ఇసిఎస్ చైర్మన్‌గా అప్పారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం/కశింకోట నవంబర్ 21: అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (ఆర్‌ఇసిఎస్) చైర్మన్‌గా మండలంలోని ఆదిరెడ్డిపాలెంకు చెందిన వ్యాపార వేత్త,తెలుగుదేశం పార్టీ నేత కొటాన అప్పారావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయనకు రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేటివ్‌శాఖ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ నుంచి వచ్చిన నియామకపు పత్రాన్ని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా వెనె్నల పాలెంలో అందజేశారు. ఈ సందర్భం గా కొటాన అప్పారావు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని కట్టబెట్టిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించటంతోపాటు వినియోగదారులకు నిస్వార్థ సేవలందిస్తానన్నారు. ఈసందర్భంగా తనకు పదవి రావటంకో కృషి చేసిన ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ,ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి గంటా శ్రీనివాసరావుతదితరులకు కృతజ్ఞలు తెలిపారు.