విశాఖ

‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు,నవంబర్ 22: దశాబ్దాల కాలంగా సాగులో ఉన్న పోడు, బంజరు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సి.పి. ఐ. జిల్లా కార్యదర్శి ఎ.జె.స్టాలిన్ డిమాండ్ చేసారు. మంగళవారం సి.పి. ఐ. ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రపాలెం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆక్కడ కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ గిరిజనులు ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటున్న కొండపోడు, బంజరు భూములకు నేటికీ పట్టాలివ్వకపోవడం అన్యాయమన్నారు. దీంతో వారికి ఆభూములపై హక్కు లేకుండా ఎటువంటి లబ్దిపొంద లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అటవీ హక్కుల చట్టంలో సాగు భూములకు పట్టాలివ్వాల్సి ఉన్నా ఆదిశగా చర్యలు లేవని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేసారు. మారుమూల ప్రాంత ప్రజలు ఎటువంటి పథకాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫించన్లుకు అర్హులైన వారికి ఫించన్లు కూడా లేవని పేర్కొన్నారు. 55 ఏళ్ళకే ఫించన్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడ చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. కమిటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కూడా భూషణం మాట్లాడుతూ గతంలో కొందరికి పట్టాలు మంజూరు చేసినా భూములు చూపలేదని ఇప్పటికైనా వారందరికీ ఆయా భూములు చూపాలన్నారు. గిరిజనులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటిస్తూ ఐ.టి.డి. ఎ. ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో సి.పి. ఐ. మండల కార్యదర్శి వారా నూకరాజు అధ్యక్షత నిర్వహించిన ఈకార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.సత్యనారాయణ, జిల్లా నేత చిన్నారావు, రైతు సంఘం నేతలు మేకా సత్యనారాయణ, డి. కనకనరాజు, స్థానిక నేతలు సత్యనారాయణ, ఎస్.కొండలరావు , ఎం.పి.టి.సి. చడ్డారత్నం తదితరులు పాల్గొన్నారు.