విశాఖపట్నం

కార్తీకంలో హరిదాసు సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, నవంబర్ 22: సంక్రాంతి దినాల్లో కనిపించే హరిదాసులు కార్తీకమాసంలో వీధుల్లో సంచరిస్తున్నారు. సంక్రాంతి సమయంలోనే హరిదాసులు గ్రామాల్లో కనిపించడంతో పాటు ప్రజలు ఇచ్చే కానుకలను స్వీకరించే వారు. నేడు దీనికి బిన్నంగా కార్తీకమాసంలో హరిదాసులు పరవాడ పరిసర గ్రామాల్లో సంచరించడం జరుగుతుంది. కార్తీకమాసం నెల రోజులు గ్రామాల్లో హరిదాసులు తిరుగుతూ ప్రజలు ఇచ్చే కానుకులను స్వీకరించడం జరుగుతుంది. అయితే సంక్రాంతి విడిచి కార్తీకమాసంలో ఎందుకు గ్రామాల్లో తిరుగుతున్నారని హరిదాసులను పలువురు ప్రశ్నించడం కనిపించింది. అయితే సంక్రాంతి సమయంలో అన్ని గ్రామాల్లో సంచరించడం కష్టంగా ఉందని, హరిదాసు వృత్తిని నిర్వహించే కుటుంబాల సంఖ్య ఘననీయంగా తగ్గుతుందని, అనేక ఈ వృత్తిని విడిచి పెట్టి వ్యాపారం, ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి అని హరిదాసులు చెబుతున్నారు. ఈ వృత్తిని నమ్ముకుని ఉన్న హరిదాసులు మాత్రం సంక్రాంతి, కార్తీకమాసాల్లో గ్రామాల్లో సంచరించడం జరుగుతుందని హరిదాసు తెలిపారు.