విశాఖపట్నం

అరువుపై రేషన్ సరకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 2: డిసెంబర్ నెల రేషన్ సరకులను కార్డుదారులకు అరువు ప్రాతపదికన ఇవ్వనున్నట్టు సంయుక్త కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కరెంటు ఖాతాలు లేని డీలర్లు ఖాతాలు తెరచే వరకు కార్డుదారులకు అరవు ప్రాతిపదికని సరకులను అందజేయాలన్నారు. డిసెంబర్ కోటా కింద చెల్లించాల్సిని మొత్తాన్ని జనవరిలో కార్డుదారుల బ్యాంకు ఖాతాల నుండి డీలర్ల ఖాతాల్లోకి మళ్లించడం జరుగుతుందన్నారు. కార్డుదారులి ఖాతాలు యాక్టివేట్ కాకపోతే వారి తరపున ప్రభుత్వమే చెల్లిస్తుందని, యాక్టివేట్ అయిన తదుపరి రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నగదురహిత లావాదేవీలను మాత్రమే చేస్తున్నందుని డిసెంబర్ నెలకు చెందిని సరకులని అప్పు ప్రాతిపదికన చెల్లించనున్నట్టు స్పష్టం చేశారు. నగదును కోరిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని, డబ్బులివ్వని కార్డుదారులకు సరకులవ్వమనే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ దుకాణాల్లో కాకుండా వేరొకి దుకాణాల్లో సరకులు తీసుకున్నా కార్డుదారులి ఖాతాల నుండి జనవరిలో డీలర్ల ఖాతాకు నిధులు మళ్ళించనున్నట్టు చెప్పారు.