విశాఖపట్నం

నగదు రహిత లావాదేవీలపై నెల రోజుల స్పెషల్ డ్రైవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 2: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలను మరింత ఉధృతం చేసే క్రమంలో నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన ఆయన జన్మభూమి-మావూరు తరహాలో ఉద్యమంలా నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నోట్ల రద్దుతో నగదు సమస్య ఎదురైందని, చిల్లర సమస్య పరిష్కారానికి నగదు రహిత లావాదేవీలే కీలకమన్నారు. ఈ అంశాన్ని దేశ వ్యాపితంగా ఉద్యమ స్థాయిలో ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జాతీయ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో అధికారులతో కమిటీలను వేయాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 15 మంది సభ్యులతోను, జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన, కలెక్టర్ ఎగ్జిక్యుటివ్ చైర్ పర్సన్‌గా జిల్లా స్థాయి కమిటీ, సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ అధ్యక్షతన డివిజన్ స్థాయి కమిటీ, మండల ప్రత్యేకాధికారుల అధ్యక్షతన మండల, వార్డు స్థాయి కమిటీలు పనిచేస్తాయన్నారు. జిల్లాకు సీనియర్ ఐఎఎస్ అధికారి విజయానంద్‌ను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించిందన్నారు. పింఛన్, రేషన్, ఉపాధి కూలీ పొందేవారిచే బ్యాంకు ఖాతాలను తెరిపించడం, వారికి డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు ఇప్పిండం తప్పనిసరిగా జరిగేట్టు చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యాపార సంస్థలు, వీధి వ్యాపారులతో పాటు క్రయ,విక్రయాలు జరిగే ప్రతి చోటా ఇ పోస్ మిషన్లు ఏర్పాటు చేసేలా చూడాలని లీడ్ జిల్లా మేనేజర్‌కు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం కల్పించేలా పెద్ద ఎత్తున ప్రచార సామగ్రి జిల్లాకు వస్తోందని వివరించారు. వీటిని క్షేత్ర స్థాయికి పంపిణీ చేయాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పాఠశాలలు, కళాశాలలు, మండల కార్యాలయాలు, మీ సేవ కేంద్రాలు, చౌకధరల దుకాణాలతో పాటు ముఖ్య కూడళ్లు, మొబైల్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు ప్రగతి నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని సూచించారు. సమావేశంలో జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, జెసి 2 డివి రెడ్డి, డిఆర్‌ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎల్‌డిఎ శరత్‌బాబు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు అధికారి సత్యసాయి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.