విశాఖపట్నం

అందరూ బ్యాంక్ ఖాతా తెరవాల్సిందే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, డిసెంబర్ 2: ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను తెరవల్సిందేనని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన అకస్మికంగా కశింకోట స్టేట్‌బ్యాంక్, రేషన్‌డిపోలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఖాతా ఉన్న వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు తదితర లావాదేవీలు అన్నింటికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్యాంక్ ఖాతాలు లేనివారు వెంటనే ఖాతాను ప్రారంభించాలన్నారు. అంతేకాకుండా పూసర్లవీధిలో ఉన్న రేషన్ డిపోను కూడా ఆయన తనిఖీ చేశారు. ఎంతమంది రేషన్‌కు వస్తుంటారు, వారికి ఏవిధంగా రేషన్ అందజేస్తున్నారు, సరకుల పై ఆరా తీశారు. మండలంలో ఉన్న డిపోల వివరాలను ఆర్‌డిఓ పద్మావతిని అడిగి తెలుసుకున్నారు. ఎస్‌బిఐ మేనేజర్‌తో మాట్లాడుతూ నగదు పంపిణీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్క రూ వారి గుర్తింపుకార్డులను చూపించమని వీలైనంత వరకు ఇబ్బందులు లేకుం డా చూడాలన్నారు. ఖాతాదారులతో సమన్వయం పాటించాలన్నారు. ఎవరితోని వాగ్వివాదానికి దిగకుండా ఖాతాదారులకు అవసరమైన మెరుగైన సేవలను బ్యాంక్ సిబ్బంది అందజేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే స్థానిక పబ్లిక్‌స్టేజ్‌పై జరిగిన ఫెన్షనర్ల సమావేశంలో ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ మాట్లాడుతూ పెన్షనర్లు అందరూ ఆయా బ్యాంక్‌ల్లో ఎకౌంట్లు ఓపెన్ చేసుకోవాలన్నారు. కశింకోటలో పెన్షనర్లు సుమారు 70 మందికి బ్యాంక్ ఖాతాలు లేవన్నారు. రానున్న రోజుల్లో రూపేకార్డుపై కూడా పూర్తిగా అవగాహన చేసుకుని వినియోగించుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ కార్డుల వినియోగానికి అవగాహన కార్యక్రమాలుకు హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ తిరుచోళ్ల నాగేశ్వరీ, డిసిసిబి డైరక్టర్ శిదిరెడ్డి శ్రీనివాసరావు, దేశం నాయకులు పెంటకోట రాము తదితరులు పాల్గొన్నారు.