విశాఖ

కాఫీ సాగుతో పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 8: కాఫీ సాగులో గిరిజన రైతులు అధిక దిగుబడులను సాధించి పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆకాంక్షించారు. పాడేరు మండలం మినుములూరు కాఫీ బోర్డు ఆవరణలో గురువారం నిర్వహించిన క్షేత్ర దినోత్సం-2016లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాఫీ బోర్డు అధికారులు అందిస్తున్న సలహాలు, సూచనలను పాటించి ఎకరాకు మూడు వందల కిలోల కాఫీ దిగుబడిని సాధించాలని అన్నారు.
ఏజెన్సీలో గిరిజన రైతులు ప్రస్తుతం ఎకరాకు 80 నుంచి 150 కిలోల కాఫీని మాత్రమే దిగుబడి చేస్తున్నారని, దీనిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. విశాఖ మన్యంలో 526 కోట్ల రూపాయలతో కాఫీ తోటల విస్తరణ పనులు చేపట్టామని, గిరిజనులకు ప్రధాన పంటగా దీనిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. కాఫీ ఉత్పత్తులను పెంచేందుకు, గిట్టుబాటు ధరను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే కాఫీ రైతులకు దళారీల బెడద లేకుండా గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ సేకరణ చేపట్టి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మన్యంలో కాఫీ ఉత్పత్తులను గణనీయంగా పెంచాలన్న సంకల్పంతో సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి జి.వి.క్రిష్ణారావును ప్రభుత్వం కాఫీ సలహాదారుగా నియమించినట్టు ఆయన చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజన రైతులు అలవరుచుకుని కాఫీ దిగుబడలో గణనీయంగా రాణించాలని ఆయన కోరారు. కాఫీలో ప్రభుత్వం అనుకున్న దిగుబడి లక్ష్యాలను సాధించాలంటే రైతుల సహకారం ఎంతో అవసరమని, కాఫీ అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్న సలహాలు, సూచనలు పాటించి కాఫీ సాగు చేపడితే లక్ష్య సాధన అంత కష్టం కాదని ఆయన చెప్పారు. గిరిజన ఉప ప్రణాళిక కింద 90 కోట్ల రూపాయల వ్యయంతో మన్యంలో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమానికి నిర్థిష్టమైన విధానాలను రూపొందించి వాటిని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. గిరిజనులు ఆర్థికంగా ఎదిగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏజెన్సీలోని అన్ని వసతి గృహాలను గురుకుల వసతి గృహాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 28 యువజన శిక్షణా కేంద్రాల ద్వారా గిరిజన యువతకు వివిధ రంగాల్లో శిక్షణ కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. గిరిజన యువత ప్రభుత్వం అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యువ పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కిషోర్‌బాబు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ కాఫీ సలహాదారు జి.వి.క్రిష్ణారావు మాట్లాడుతూ మన్యంలో ప్రతి సంవత్సరం ఫీల్డ్ డే నిర్వహించాలని కాఫీ అధికారులకు సూచించారు. కాఫీ సాగుకు భూసారంతో పాటు నీడనిచ్చే తోటల పెంపకం చాలా మఖ్యమని ఆయన అన్నారు. కాఫీ బోర్డు కార్యాలయంలో సీనియర్ లైజన్ అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, గిరిజన రైతులు కాఫీ సాగుపై ఎప్పటికప్పుడు చర్చించి ఆయన సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అనంతరం పాడేరు కాఫీ హౌస్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విశాఖ ఏజెన్సీలో మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్, గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రకాశ్, కాఫీ సంయుక్త సంచాలకులు గుడ్డే గౌడ, భాస్కరరెడ్డి, ఉప సంచాలకులు రమేష్, కాఫీ బోర్డు అధికారి సునీల్‌బాబు, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, పలువురు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన రైతులు పాల్గొన్నారు.