విశాఖపట్నం

సార్క్ దేశాలు ప్రగతి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, డిసెంబర్ 8: సార్క్ సభ్యదేశాలు సమన్వయంతో పని చేస్తూ ప్రగతి సాధించాలని ఎయు విసి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎయు ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో సార్క్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయులో నెలకొల్పిన సార్క్ కేంద్రం దేశంలోనే ఏకైక కేంద్రంగా నిలుస్తోందన్నారు. యువ విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మంచి పరిశోధనలకు అవకాశం కలిగిందన్నారు. వచ్చే నెల 5 నుంచి జరిగే అంతర్జాతీయ సదస్సులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యానస్ హాజరవుతారన్నారు. మాజీ రెక్టార్ ఆచార్య ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో 21 శాతం జనాభా సార్క్ దేశాల్లోనే ఉందన్నారు. పోషకాహాలోపం, లింగ అసమానతలు, స్ర్తిల ఆరోగ్య సమస్యలు వంటివి అధికంగా సార్క్ దేశాల్లోనే ఉంటున్నాయన్నారు. ప్రపంచం సంక్షోభం ఎదుర్కొంటుందన్నా గ్రామీణాభివృద్ధి, క్లైమేట్, ప్రజారోగ్యం వంటి రంగాల్లో సార్క్ దేశాలు కలసి పని చేస్తున్నాయన్నారు. సార్క్ దేశాల మేధావులతో సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. మాజీ విసి ఆచార్య కోనేరు రామకృష్ణారావు మాట్లాడుతూ గాంధీ సిద్ధాంతాలు సార్క్ దేశాల సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. శాంతియుత పరిష్కారాలకు పని చేయాలన్నారు. నేటి తరానికి గాంధీజీ సిద్ధాంతాలు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. విశ్రాంత ఆచార్యులు చందుసుబ్బారావు మాట్లాడుతూ భారత్‌ను పెద్దన్నగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ముందుడుగు వేసి ఆర్థిక తోడ్పాటును అందిస్తుందన్నారు. భారత్‌ను భయానక దృక్పథంతో చూడడం తగదన్నారు. ఆధునిక తరాలు మత దృక్పథానికి దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. సార్క్ కేంద్రం సంచాలకులు ఆచార్య ఎం. ప్రసాదరావు మాట్లాడుతూ 31 ఏళ్ళుగా సార్క్ తన సేవలను అందిస్తుందన్నారు. పరస్పరం సమన్వయం, సహకారం అందిస్తూ పనిచేస్తున్నాయన్నారు. సంయుక్త ఆసక్తి కలిగిన అంశాల్లో పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్ చిట్టినేని, ఐఎంఎఫ్ రీజనల్ డైరెక్టర్ జి.పద్మజ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (న్యూఢిల్లీ) డాక్టర్ అనసూయ బసురాయ్‌చౌదరి, డాక్టర్ శ్రీమన్నారాయణ తదితరులు ప్రసంగించారు.