విశాఖపట్నం

కొండగుడికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, డిసెంబర్ 8: నగరంలోని పాత పోస్ట్ఫాసు వద్దనున్న రోజ్ హిల్‌పై అమలోద్బవి ఉత్సవం (కొండ గుడి) గురువారం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా భక్తులు తెల్లవారు జాము నుంచే అధిక సంఖ్యలో బారులు తీరి మొక్కలు తీర్చుకునేందుకు కాలి నడకన, మరి కొంత మంది మోకాళ్ళపై మెట్లమీదుకు ఎక్కి మాతను దర్శించుకున్నారు. ఏసుక్రీస్తు తల్లిగా, లోకమాతగా మరియమ్మ జీవితం అందరికీ ఆదర్శమని, కష్టాల్లో కుంగిపోకుండా సంతోషాల వేళ సాగిలపడకుండా స్థిరమైన జీవితాన్ని గడపాలని ఉత్తరాంధ్ర ప్రజలు అమలోద్బవి మాతను ఆరాధిస్తారు. ప్రతి ఏడాది నిర్వహించే కొండగుడి పండగకు వేలాదిమంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాతను దర్శించుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అయిదు గంటలకే ఇంగ్లీషు, తెలుగులో దివ్యపూజా బలాలు నిర్వహిస్తారు. 7.30 గంటలకు విశాఖ అగ్రపీఠాధిపతులు డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ఆధ్వర్యంలో పొలిటికల్ దివ్యపూజా బలాలు నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి భక్తులు ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొండ దిగువ నున్న సెయింట్ అల్లోసియస్ స్కూలు నుంచి కొండ గుడికి ప్రదక్షిణలు నిర్వహించి సాయంత్రం తెలుగులో గుహ వద్ద దివ్య పూజలు నిర్వహిస్తారు. 14 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించిన దివ్యజ్ఞాన స్వరూపాన్ని భక్తులంతా దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ ప్రాధాన్యాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్ళు అందర్ని ఆకట్టుకున్నాయి. కొండ దిగువ నుంచి కొండపైకి ఎటువంటి వాహనాలు అనుమతించకపోవడంతో కొత్త రోడ్డు జంక్షన్ నుంచి ట్రాఫిక్ పూర్తిస్థాయిలో స్తంభించింది. పోలీసుల బందోబస్తు, ఆలయ వర్గాలు ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణతో పోస్ట్ఫాసు ప్రాంతమంతా సందడి వాతావారణంతో నిండిపోయింది.