విశాఖ

ఉగాది రోజైనా తప్పులు చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 7: తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది నాడైనా తప్పులు చేయరాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబుపై రామకృష్ణ మండిపడ్డారు. కమ్యూనిస్టుపార్టీ సీనియర్ నాయకులు కోడుగంటి గోవిందరావు ద్వితీయ స్మారకోపన్యాసం సందర్భంగా ‘్భరత రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-ఎన్నికల సంస్కరణలు’ అనే అంశంపై సమావేశం గురువారం పౌర గ్రంథాలయంలో జరిగింది. దీనిలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన ప్రజాస్వామ్యం నేడు ధనస్వామ్యంగా మారిందన్నారు. కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో ప్రజాస్వామ్యం ఉందని ఇది చాలా ప్రమాదకరమన్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను డబ్బు శాసిస్తోందని, నేడు మంత్రుల పదవుల్లో ఉండే నేతలంతా కోటీశ్వరులేనన్నారు. ఇలాంటి వారు చట్టాలు రూపొందిస్తే సామాన్యులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని వక్తలు ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. అవి నేడు అమలు కావడంలేదన్నారు. గోవిందరావు రైతుల సమస్యలపై లోతైన అధ్యయనం చేశారన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించి రైతునాయకునిగా గుర్తింపు పొందారని, గోవిందరావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రతిఒక్కరూ ప్రతి కృషి చేయాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. ముందుగా గోవిందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఎఎస్ శర్మను దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సిపిఐ నగర కార్యదర్శి డి.మార్కండేయులు పాల్గొన్నారు.