విశాఖ

నగదు కోసం బారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 11: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు నగదు కోసం నానా అవస్థలు పడుతున్నారు. గత నెలరోజులుగా నగదు కోసం ప్రజలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా శనివారం నుండి సోమవారం వరకు బ్యాంకులకు సెలవులు కావడంతో ప్రజల వద్ద నిత్యావసర ఖర్చులకు డబ్బుల్లేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏటిఎంల్లోనైనా నగదు ఉన్నట్లయితే వచ్చిన రెండువేలుతోనైనా అవసరం తీరేది. అయితే మూడురోజులు బ్యాంకులకు సెలవు అని ప్రజలకు తెలియడంతో ఏటిఎంల్లో ఉన్న నగదు శుక్రవారం రాత్రే ఖాళీ చేసారు. పట్టణంలో సుమారు 30 ఏటిఎం కేంద్రాలుండగా ఒక్క ఏటిఎంలో కూడా నయాపైసా లేని పరిస్థితి శని, ఆదివారాల్లో నెలకొంది. ఎక్కడ చూసినా నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్ అంటూ ఎటిఎం కేంద్రాల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. చేతిలో డబ్బులేక ఏటిఎంలు పనిచేయక, బ్యాంక్‌లు సెలవు కావడం తదితర సమస్యలతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.