విశాఖపట్నం

కష్టాలు మాకేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తమపైనే ప్రభావం చూపుతోందని, పెద్ద వాళ్లు మాత్రం దర్జాగా బ్యాంకుల నుంచి సొమ్ము తీసుకుంటున్నారంటూ సామాన్య ప్రజానీకం మండిపడ్డారు. నోట్ల రద్దు అనంతరం పరిస్థితులపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు మంగళవారం ఉదయం సీతమ్మధార ఆంధ్రాబ్యాంకు వద్ద ఖాతాదారులతో ముచ్చటించే ప్రయత్నం చేశారు. మూడు రోజుల బ్యాంకు సెలవు అనంతరం మంగళవారం తెరచుకున్న బ్యాంకుకు వందల సంఖ్యలో ఖాతాదారులు క్యూ కట్టారు. అదే సమయంలో ఎంపి హరిబాబు బ్యాంకులో నగదు తీసుకునేందుకు వచ్చిన ఖాతాదారులను పలకరించే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు ఖాతాదారులు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అయితే కొంతమంది సానుకూలంగా స్పందించినప్పటికీ అత్యధికులు మాత్రం ప్రభుత్వం తీసుకున్న హఠాత్ నిర్ణయం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నది తామేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు జరిగి 35 రోజులు దాటుతుండగా ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని, ఎప్పటికి బ్యాంకుల్లో సాధారణ పరిస్థితుల మాదిరి నగదు తీసుకోగలుగుతామోనంటూ వాపోయారు. బ్యాంకులో ఉన్న తమ నగదును తీసుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మాత్రం వందల కోట్లు వెచ్చించి ఆడంగబరంగా వివాహాలు చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. సామాన్యుడు ఇంట్లో వివాహం చేసుకోవాలంటే కేవలం రూ.2.5 లక్షల నగదు తీసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2000 నగదు కోసం గంటల తరబడి ఎటిఎంల వద్ద క్యూలో నిల్చుంటున్నామని, వచ్చే పెద్ద నోటును మార్కెట్‌లో మార్చుకోవాలంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఎంపి ఎదుట తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. రద్దు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు తట్టుకుంటామని, అవినీతి పరులు ఇక మీదట నల్లధనం పోగేసుకోకుండా చూడగలరా అంటూ కొంతమంది ఎంపిని ప్రశ్నించారు. అయితే కేవలం అతికొద్ది మంది మాత్రం నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమేనని, ప్రభుత్వం మరికొంత శ్రద్ధ తీసుకుని ఉంటే పరిస్థితులు చేయిదాటేవి కావని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎంపి హరిబాబు బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎటిఎంలలో పూర్తి స్థాయిలో నగదు ఉంచాలని సూచించారు. ఆంక్షల మేరకు రూ.2000 నగదు వచ్చేలా ఎటిఎంలలో నోట్లు అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారు పెద్ద నోట్లను తీసుకుంటారని సూచించారు. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు ఎటిఎంలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.