విశాఖపట్నం

పెద్ద నోట్లకు చెల్లుచీటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: పెద్ద నోట్ల మార్పునకు గురువారంతో బ్రేక్ పడింది. కేంద్రం ఇచ్చిన గడువు పూర్తికావడంతో ఇక నుంచి వీటిని తీసుకునేదిలేదంటూ మెడికల్ దుకాణాలు, పెట్రోల్ బంక్‌ల నిర్వాహాకులు స్పష్టంచేస్తున్నారు. దీంతో ఏమీ చేయాలో తెలియని కొందరు అయోమయంలో పడుతున్నారు. గత కొన్నాళ్ళుగా ఉండిపోయిన రూ.500, వెయ్యి రూపాయల నోట్లను పెట్రోల్ బంక్‌లు, మెడికల్ షాపుల్లో మార్చుకునే అవకాశం కల్పించడంతో ఇంతవరకు ఇవి చలామణి అయ్యాయి. అయితే గత కొంతకాలం కిందటనే పాలు, నిత్యావసర వస్తువులు, పలు రకాలైన దుకాణాలు వీటిని తీసుకోవడమనేది నిలిచిపోయింది. అందువల్ల ఇన్నాళ్ళు ఈ రెండింటి ద్వారా ఉన్న కొద్దిపాటి నోట్లను మార్చుకునేందుకు అవకాశం కలిగింది. వాస్తవానికి పెట్రోల్ బంక్‌ల్లో కూడా ఈ మధ్యకాలంలో తీసుకోవడమనేది నిలిచిపోయింది. ఏటిఎం కార్డులు స్వైపింగ్ ద్వారా పెట్రోల్‌ను కొనుగోలు చేయడం జరుగుతోంది. అలాగే వందల నోట్లనే ఎక్కువుగా వినియోగదారులు ఇస్తున్నారు. కేవలం 10 నుంచి 20 శాతం మంది మాత్రమే పాత నోట్లతో ప్రత్యక్షమవుతున్న సంఘటనలు ఉంటున్నాయి. అలాగే మెడికల్ షాపుల్లో కూడా ఇవే పరిస్థితులు.
* చేతికందని పింఛన్లు
ప్రతినెల ఒకటవ తేదీన అందే పింఛన్లు ఈనెల ఇంకా అందనేలేదు. దీంతో వృద్ధులు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. గత 15 రోజులుగా కాళ్ళు అరిగేలా తిరుగుతున్న 68 ఏళ్ళ వృద్ధురాలు గురువారం పిఎం పాలెం బ్యాంకు నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్లుండగా మార్గ మధ్యలో పడిపోయింది. చేతి కర్రతో కాలినడకను నడిచే వెళ్ళే ఈమె ప్రతిరోజు పింఛన్ కోసం వెళ్లడమే మిగులుతుంది. ఇటువంటి పరిస్థితి పిఎం పాలెం, కొమ్మాది, బక్కన్నపాలెం, రేవళ్ళపాలెం, కారుషెడ్ ఏరియా, అంబేద్కర్ నగర్, వాంబేకాలనీ, శంభువానిపాలెం తదితర ప్రాంతవాసులకు ఎదురవుతోంది. పెద్ద నోట్లతో ఎదురవుతున్న సమస్యలు అన్నీ, ఇన్నీ కావు. కాటికి కాళ్లు చాసే తమకు ప్రభుత్వం ఇంకా పరీక్షలు పెడుతుందని వృద్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నోట్ల రద్దుతో పింఛన్లను నేరుగా బ్యాంకుల ద్వారా తీసుకోవడమనేది మంచి పరిణామమే అయినా దీనికోసం ఆధార్, పింఛన్, బ్యాంక్ ఖాతాలు తెరవడం, తెలుపురంగు రేషన్‌కారులకు చెందిన ప్రతులను సమర్పించడమే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. తీరా ఇవన్నీ పట్టుకుని వెళ్ళినా బ్యాంకుల వద్ద వెయ్యి రూపాయలు ఇచ్చే పరిస్థితులేవని, వంద నోట్లు లేక, ఖాతాల్లో ఉండే కొంత సొమ్ముతో కలిపి రెండు వేలు ఉన్నా ఇది తీసుకుంటే ఖాతా పూర్తిగా రద్దయ్యే పరిస్థితులు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నాయని మరికొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు వేల నోట్లను తీసుకువచ్చిన తరువాత బయట వీటిని మార్చడం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందని అంటున్నారు.
* చేతికందితేనే పనులు
నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనులు చేసుకునే వలస కూలీలు ఇప్పుడు పనుల్లోకి వెళ్ళేందుకు సాహసించడంలేదు. ఎందుకంటే పాత నోట్లు, లేదంటే కొత్తగా వచ్చిన రెండు వేల నోట్లను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ రెండింటి వలన ఇబ్బందులు పడేకంటే నాలుగు రోజులు పనులకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయానికి కూలీలు, డైలీ కార్మికులు వస్తున్నారు. మరికొంతమంది తమ చేతికి అవసరమైన వంద నోట్లను కూలీగా ఇచ్చిన తరువాతనే పనులకు వెళ్తున్నారు. దీనివల్ల పని పూర్తయ్యాయ ఎటువంటి సమస్యలు తలెత్తవని భావిస్తున్న కొన్ని పేద, మధ్యతరగతి వర్గాలు చెందిన కూలీలు మాత్రమే పనులకు సాహసిస్తున్నారు.
* పేటిఎంలకు పెరుగుతున్న ఆదరణ
ఆన్‌లైన్ విధానం ద్వారా నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పేటిఎం యాప్ ద్వారా లావాదేవీలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు,చిరువ్యాపారులు సైతం ఈ యాప్ ద్వారా వందలాది రూపాయలు బదిలీ చేసుకుంటున్నారు. నగరంలోని ఎంవిపి కాలనీ, ఆంధ్రాయూనివర్సిటీ, మద్దిలపాలెం, షాపింగ్‌మాల్స్, సినిమాహాళ్ళు, హోటళ్ళు తదితర వాటిలో ఈయాప్ ద్వారా చెల్లింపు నిర్వహిస్తుండటం విశేషం.