విశాఖపట్నం

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 17వ తేదీన నగరంలో జరుపనున్నపర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాలను అధికార, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున ప్రొటోకాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. 10.05 గంటలకు వుడా బాలల థియేటర్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే 10.30 గంటలకు ఏయు ఫుట్‌బాల్ మైదానం చేరుకుని 68వ ఫార్మసీ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారని, 12 గంటలకు రుషికొండ ఐటి పార్కులోని హిల్ నెంబర్ 2కు చేరుకుని ఫిన్‌టెక్, పిటిఎం అభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తారన్నారు. వౌరిటెక్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను ప్రారంభిస్తారని, సిఇఓలతో సమావేశం అవుతారన్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు పోర్టు కళావాణి ఆడిటోరియంకు చేరుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్‌లతో కలసి దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం చేరుకుని వరల్డ్ విండ్ ఫెస్టివల్‌లో పాల్గొంటారన్నారు. రాత్రి 6.45 గంటలకు ఏయు కాన్వొకేషన్ హాలుకు చేరుకుని ఏయు పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రాత్రి 7.30 గంటలకు ఏయు నుండి బయలుదేరి 7.50 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని 8 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారన్నారు. ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వరల్డ్ విండ్ ఫెస్టివల్ సంగీత కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం జీవిఎంసి ఆధ్వర్యంలో మొబైల్ మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా సభలు, సమావేశాలకు హాజరయ్యే ప్రజలగకు, ముఖ్యులు అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో నగర పోలీసు కమిషనర్ టి.యోగానంద్, డిసిపి నవీన్ గులాటి జిల్లా అధికారులు పాల్గొన్నారు.