విశాఖపట్నం

పారిశ్రామికవేత్తలే రాష్ట్ర ప్రగతిలో కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: రాష్ట్భ్రావృద్ధిలో పారిశ్రామికవేత్తలే కీలకమని, పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ జయరాంరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాష్ట్రాన్ని పర్యాటకంలో దేశంలోనే ఉత్తమంగా నిలపాలని అహర్నిశలూ కృషి చేస్తున్నారని, ఆ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని రాష్ట్భ్రావృద్ధిలి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రుషికొండలోని హరిత రిజార్ట్స్‌లో టూరిజం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇనె్వస్టర్స్ మీట్ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ జయరాంరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఏపీ పర్యాటకి పాలసీ ఉత్తమైనదన్నారు. ఈ పాలసీలో పెట్టుబడుదారులకు అనేక ప్రోత్సాహాకులనందించడం జరుగుతోందని, పెట్టుబడుదారులు లేకపోతే రాష్ట్ర భవిష్యత్ ఉండదన్నారు. రాష్ట్ర పర్యాటానికి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటికే 200 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయన్నారు. మరో 300 కోట్లకు రావాల్సి ఉందన్నారు. కాకినాడ బీచ్ అభివృద్ధికి 70 కోట్లు, నెల్లూరుకు 60 కోట్లకు రావాల్సి ఉందన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యమని, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటకానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నారని, వారానాకోసారి సమీక్షిస్తున్నారని, పర్యాటక రంగంలో హోటళ్ళు, రిజార్ట్స్‌కు ప్రతిపాదనలతో త్వరగా రావాలన్నారు.
* పర్యాటక రాజధానిగా విశాఖపట్నం
విజయవాడ రాష్ట్ర రాజధాని అయినప్పటికీ విశాఖపట్నం పర్యాటక రాజధానిగా వెలుగొందుతుందని పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజాశంకర్ పేర్కొన్నారు. పర్యాటకంలో వౌలిక వసతుల అభివృద్ధి, ఉత్తమ సేవలందించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని, విశాఖలో మధురవాడ, ఎండాడ, పరవాడ, తొట్లకొండ తదితరి ప్రాంతాలు పెట్టుబడులకు అనువైనవని పేర్కొన్నారు. ఇచ్ఛాపురం నుండి తడ వరకు హైవేను ఆనుకుని హోటళ్ళు, రికార్డులు, పార్కింగ్ స్థలాలు అభివృద్ధి చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. ఏపిటిడిసి వెబ్‌సైట్‌లో పర్యటానికి గల అవకాశాలు, నిబంధనలు ఉన్నాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పెట్టుబడులకు సరైన ప్రతిపాదనలతో రావాలని, ఏ ప్రాజెక్టుకు ఏ స్థలం సరైనదో మేం సలహాలనిస్తామన్నారు. మూడు జిల్లాల్లో నున్న అవకాశాలపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఈ వివరాలను పెట్టుబడుదారుల ప్రశ్నలకు ఎండి సమాధానాలనిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ, వారి ప్రతిపాదనలను కొన్నింటిని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
* రెండంకెల వృద్ధిలో పర్యాటకం
రాష్ట్ర రెండెంకెల వృద్ధిలో పర్యాటకం ప్రధానపాత్ర వహిస్తోందని, పర్యాటకంలో పెట్టుబడులు పెట్టే వారికి జిల్లాలో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని, పారదర్శకరగా, సత్వరంగా ఫైళ్ళను డిస్పోజ్ చేస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గత సిఐఐ సదస్సులో సుమారు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, సింగిల్ విండో ప్రాతిపదికన వారికి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీగా విశాఖపట్నం పెట్టుబడులకు అనుకూలమని, జిల్లాయంత్రాంగం నుండి చిన్నచిన్న సమస్యలుంటే జిల్లాస్థాయి కమిటిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఏ సమయంలోనైనా పెట్టుబడుదారులు తనను కలవచ్చునని, ఎలాంటి సందేహాలనైనా, సమస్యలనైనా చెప్పవచ్చన్నారు. వుడా,జీవీఎంసి సంస్థలు కూడా ఉత్సాహంగా ఉన్నాయని, పర్యాటకంలో సుస్థిర అభివృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నావమని, దీనికి పెట్టుబడుదారులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఏపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఫెడరేషన్ అధ్యక్షులు సాంబశివరావు, భాస్కర్, ప్రసాద్, ఆప్కాబ్ మేనేజర్ రామకృష్ణారావు, పర్యాటకశాఖ ఇడి శ్రీరాములు నాయుడు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యాటక అధికారులు, మూడు జిల్లాల హోటళ్ళు యజమానులు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రతినిధులు హాజరయ్యారు.
విమ్స్ ప్రైవేటీకరణ లేనట్టే?
జగదాంబ, డిసెంబర్ 15: విశాఖ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (విమ్స్) ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని, ప్రజలందరికీ జనవరి ఒకటి నుంచి సూపర్ స్పెషాల్టీ సేవలు అందుబాటులోకి రానున్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టంచేశారు. శుక్రవారం విశాఖ పర్యటనలో భాగంగా ఆమె విమ్స్‌ను సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన పాలకమండలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమ్స్ ప్రైవేటీకరణ అంశంపై తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఓపీ సేవలు మరింత విస్తృతం చేయడంతోపాటు అత్యవసర ట్రామాకేర్ సేవలను, మాతాశిశు మరణాల సేవలను పెంచే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. త్వరలోనే 50 పడకలు అందుబాటులో వస్తాయని, ఆసుపత్రి ప్రైవేటీకరిస్తున్నామంటూ రాజకీయ పక్షాలు ఆందోళనలు చేయడంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగిస్తామని ఆమె తెలిపారు. స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న పాలకమండలి నేతృత్వంలో ఆసుపత్రి పనిచేస్తుందన్నారు. జనవరి ఒకటవ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ, బ్లడ్‌బ్యాంక్, ఇతర స్పెషాల్టీ, ఐపి,ఓపీ సేవలు తదితర వాటిని అమల్లోకి తీసుకురావాలన్నారు. ఎయిమ్స్, నిమ్స్ తరహాలో కొనసాగిస్తామని ఇ పాలకమండలి అధికారులు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ ఎం.సుబ్బారావు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎన్టీఆర్ వైద్యసేవ సిఇఓ రవిశంకర్, విమ్స్ డైరెక్టర్ సివి రావు, ఆసుపత్రి ఆర్‌ఎంఓ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.