విశాఖపట్నం

ఫిన్‌టెక్ వ్యాలీ ప్రారంభానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: రాష్ట్రంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కేంద్ర బిందువుగా విశాఖ నగరం ఆవిర్భవంచబోతోంది. రుషికొండ ఐటి సెజ్‌లో ఫిన్‌టెక్ వ్యాలీ ఏర్పాటుతో విశాఖ ఐటి రంగం రూపురేఖలు మారనున్నాయి. విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టే విధంగా ఫిన్‌టెక్ వ్యాలీ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలకు కేంద్రంగా నిలిచిన పేటిఎం వంటి సంస్థలు ఇక్కడ తమ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. తద్వారా మరిన్ని సంస్థలు ఫిన్‌టెక్ వ్యాలీలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నాయి. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కాబోత్నున ఫిన్‌టెక్ వ్యాలీలో పేటిఎంతో పాటు మరో నాలుగు సంస్థలకు అవకాశం కల్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఫిన్‌టెక్ వ్యాలీలో సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇక్కడే ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రదర్శనను సిఎం తిలకిస్తారు.
సిఎం సుడిగాలి పర్యటన నేడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నగరంలో విస్తృత కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి నేరుగా విశాఖ చేరుకున్న చంద్రబాబు నాయుడు విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో రూ.22 కోట్లతో నిర్మించిన బాలల థియేటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఎయు ఫుడ్‌బాల్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 68వ ఇండియన్ ఫార్మా స్యూటికల్ కాంగ్రెస్‌లో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా రుషికొండ చేరుకుని ఫిన్‌టెక్ వ్యాలీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగే దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు ఎయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగే అంతర్జాతీయ విండ్ ఫెస్టివల్‌ను చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు రోను మజుందార్, రాకేష్ చౌరాసియా, డ్రమ్స్ కళాకారుడు శివమణి తదితరులు పాల్గొంటారు. ఇక్కడ నుంచి బయలుదేరి ఎయు కాన్వొకేషన్ హాల్‌లో జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం (అలూమినా)లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు, పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లిఖార్జున రావు హాజరుకానున్నారు.