విశాఖ

సౌకర్యాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: నగర ప్రజలకు కల్పించాల్సిన అన్ని సౌకర్యాలను అందజేయడం, సమర్ధవంతంగా కార్యక్రమాలు నిర్వహించడం లక్ష్యం కావాలని జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. కాన్ఫరెన్స్ హాల్‌లో జివిఎంసి, థాన్ ఫౌండేషన్, క్లైమేట్ డెవలప్‌మెంట్ అండ్ నాలెడ్జి నెట్‌వర్క్ సంస్థలు సంయుక్తగా ఏర్పాటు చేసిన బిల్డింగ్ క్లయిమేట్ స్మార్ట్ సిటీ ఎడాప్టింగ్ ది ఫైండింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్రూఫింగ్ ఎప్రోచ్ వర్క్‌షాపునకు ముఖ్య అతిథిగా శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ సిటీ, వాతావరణ పరిరక్షణ ద్వారా భావితరాలకు ఉత్తమ సౌకర్యాలు అందజేయడం లక్ష్యం కావాలన్నారు. స్మార్ట్‌సిటీలో ప్రధానంగా ప్రజలకు అన్ని కనీస సదుపాయాలు అందజేయడంతోపాటు భవిష్యత్‌తరాలకు అనేక సౌకర్యాలు అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత కోసం 72 వార్డుల్లో ఒక్కో కాలనీని సేంద్రీయ ఎరువు తయారు కోసం కంపోస్టు తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్టు వివరించారు. స్వచ్చంధ సంస్థలు, ప్రజలు, ఆర్‌డబ్ల్యుఏలు, బల్క్‌వేస్ట్ జనరేటర్స్ కలిసికట్టుగా చెత్త తయారైనచోటే చెత్తను విభజించి కంపోస్ట్ తయారీలో భాగస్వాములు కావాలన్నారు. దశలవారీగా నగరమంతా చెత్త విభజన - కంపోస్టు తయారీ కేంద్రాలను విస్తరించడం ద్వారా స్వచ్ఛ విశాఖకు దోహదపడనున్నట్టు వివరించారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం, భవిష్యత్‌తరాలకు అవి ఉండేలా చూడటానికి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. థాన్ ఫౌండేషన్ ప్రోగ్రాం లీడర్ రమాప్రభ స్వాగతం పలికారు. ప్రోగ్రాం లీడర్ ఎ.పవన్‌కుమార్ థాన్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్ తరాల కోసం మనం అనుసరించాల్సిన, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ గావించారు. అనంతరం ప్రజల భాగస్వామ్యంతో మధురై వాగై నది పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని ప్రదర్శించారు. బేసిక్ సర్వీసెస్, గృహ నిర్మాణం, విపత్తుల విద్యుత్, పచ్చదనం - పరిశుభ్రతపై చర్చలు జరిపారు. వర్క్‌షాప్‌లో జీవిఎంసి అధికారులు, ఇంజనీర్లు, థాన్ ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధుల పాల్గొన్నారు.