విశాఖపట్నం

తొలగుతున్న అడ్డంకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు క్రమంగా తొలగుతున్నాయి. భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 10 గ్రామాలను కలుపుతూ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారు ఇప్పుడు మెత్తబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనకాపల్లి పరిధిలోని గ్రామాలు విలీనానికి అంగీకరించగా, భీమిలి మండల పరిధిలోని కె నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జెవి అగ్రహారం గ్రామాలకు చెందిన పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఐదు పంచాయతీలకు తదనంతర కాలంలో ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ పంచాయతీలు విలీనం కాకపోవడంతో జివిఎంసి పరిధిలో చేరిన భీమిలి అనుసంధానించే దారిలేకపోయింది. తాజాగా ఈ ఐదు గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు జివిఎంసిలో విలీనానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జివిఎంసిలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్న పంచాయతీల అభిప్రాయాలకు విరుద్ధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని యంత్రాంగానికి సూచించినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో భీమిలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు పంచాయతీల విలీనానికే ప్రాధాన్యత నిస్తూ వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. సత్వర అభివృద్ధి సాధించాలంటే పంచాయతీల విలీనమే మంచిదని హితబోధ చేయడంతో పంచాయతీల ప్రజా ప్రతినిధులు అంగీకరించినట్టు సమాచారం. వీరంతా నగరంలో మంత్రి గంటాను ఆదివారం కలిసి తమ సమ్మతిని తెలిపారు. పంచాయతీలను జివిఎంసిలో విలీనం చేసేందుకు అంగీకరిస్తూ తీర్మానాలు ఆమోదిస్తే వాటిని ప్రభుత్వానికి పంపుతామని జిల్లా పంచాయతీ అధికారి మంత్రి గంటా దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి పంచాయతీ అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా జివిఎంసిలో విలీనానికి పంచాయతీలు ఆమోదించడంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయాలని యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని మంత్రి గంటా అధికారులను ఆదేశించినట్టు సమాచారం. అవసరమైన లాంఛనాలన్నింటినీ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఒక విడత నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రభుత్వం వచ్చే రెండు మూడు నెలల్లో మరో రెండు, మూడు భారీ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు వ్యూహం సిద్ధం చేస్తోంది. మేయర్ పదవికి ప్రత్యక్ష విధానంలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నారనే భావించాలి.

బిచ్చగాళ్ళ రహిత నగరంగా విశాఖ

విశాఖపట్నం, డిసెంబర్ 18: మహా విశాఖ నగరాన్ని బిచ్చగాళ్ళ రహితనగరంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని జీవీఎంసి యుసిడి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం రాత్రి ఎంవిపి కాలనీలో ఐఐఎమ్ కళాశాలలో హెల్ఫ్ ది హెల్ఫ్‌లెన్ సంస్థ మూడో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇప్పటికే నగరంలో ఉన్న ఆనాథులు, బిచ్చగాళ్ళ కోసం జీవిఎంసి నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో బిచ్చగాళ్ళ కోసమే ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్నేహ సంధ్య సంస్థ వ్యవస్థాపకులు పివిజికె మూర్తి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థ ల పాత్ర ప్రశంసనీయమన్నారు. గౌరవ అతిథఇ విజెఫ్ అధ్యక్షుడు శ్రీనుబాబు మాట్లాడుతూ గతంలో ఈ సంస్థ రక్తదాన శిబిరంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఇపుడు బిచ్చగాళ్ళు రహితనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సభ్యులు అభినందనీయులన్నారు. సంస్థ నిర్వాహాకులు మాట్లాడుతూ నగరంలో బిచ్చగాళ్ళను ఆయా వృద్ధాశ్రమాలు, ఇతర ఆశ్రయాలకు తమ సభ్యులు తరలిస్తున్నారన్నారు. అడవివరం కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కర్రి అప్పలస్వామి, టిడిపి నాయకులు గంట్ల కిరణ్‌బాబు, సంస్థ సభ్యులు ప్రభుదాస్, తులసీఈశ్వర్ పాల్గొన్నారు.