విశాఖ

దేశంలో తొలి గ్రీన్ టెంపుల్‌గా సింహాచలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 18 : సింహాచ లాన్ని గ్రీన్‌టెంపుల్‌గా తీర్చిదిద్దే కార్యక్రమం లో భాగంగా సుమారు 5 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో కృష్ణాపురం నృసింహవనంలో సౌరవిద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక మెగావాట్ సామర్థ్యం గల ఈ ప్లాంట్ పనులను నెట్‌కేప్ సంస్థ చేపడుతోంది. ఇందులో భాగంగా సుమారు అయిదు ఎకరాల విస్తీర్ణంలో మూడువేల నాలుగువందల ప్యానెల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును జనవరి మాసంలో అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయిస్తున్నారు. దేవస్థానం విద్యుత్ బిల్లులకు ఏటా సుమారు కోటీ ఏభై లక్షల రూపాయలు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో సౌరవిద్యుత్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువావడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు చరిత్రలో తొలి గ్రీన్ టెంపుల్‌గా ముద్రవేసుకోనుంది. దేవస్థానం తనకవసరమైన విద్యుత్‌ని ఉపయోగించుకొని మిగిలిన విద్యుత్‌ని ఎ పి ఇ పి డి సి ఎల్ కి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరిలోవలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ కి ఈప్రాజెక్టును అనుసంధానం చేయనున్నారు. కృష్ణాపురం నుండి సింహగిరికి సౌరవిద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన తీగలను ఏర్పాటు చేస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు.