విశాఖ

బాల కార్మిక రహిత నగరమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 19: బాల కార్మిక రహిత నగరంగా ప్రథమ స్థానంలో రూపాంతరం చెందితేనే విశాఖ నగర స్మార్ట్ సిటీకి మంచి పేరు ప్రఖ్యాతల సాధన జాబితాలో అవకా శం ఏర్పడుతుందని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎన్.సూర్యనారాయణ అన్నారు. బాల కార్మిక రహిత నగరం గా తీర్చిదిద్దుదామని రూపొందించిన 25 వేల వినూత్న ఆలోచన ధోరణిని పెంపొందించే చైల్డ్‌రైట్స్ ప్రొటక్షన్ ఫోరం రూపొందించిన ‘బాలలను కార్మికులుగా మార్చొద్దు’ మల్టీ కలర్ కరప్రతాల ఆవిష్కరణి కార్యక్రమం యునిసెఫ్ ఆవిర్భావ దినోత్స సందర్భంగా అక్కయపాలెంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి నాల్గొ తేదీన ప్రారంభమయ్యే బాలకార్మిక నగరాల్లో 500 నగరాల మన విశాఖ నగరాన్ని మొదటి స్థానం లో నిలపాలనే ఉద్దేశ్యంతో చేయి కల పాలని కోరారు. విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ బాల కార్మికులను నియంత్రించేందుకు గత ఆరేళ్ళ క్రితం అప్పటి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ చైర్మన్, కలెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యునిగా నియమించబడ్డ గొండు శీతారాం మిగిలిన తన సహచర సభ్యులు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి విశాఖ నగరానికి వనె్న తెచ్చారన్నారు. ప్రస్తుతం, అధికారిక ఎన్‌సిఎల్‌పి జిల్లా సభ్యునిగా ప్రభుత్వంలోనే కొనసాగుతూ, చైల్డ్‌రైట్స్ ప్రొటక్షన్ ఫోరం, అనే జాతీయ ప్రభుత్వేతర సంస్థ తరఫున నగర కన్వీనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రతీ మురికివాడ వాసులను, పేద ప్రజలు నివశించే కాలనీలు, అధిక సంఖ్యలో నివాసాలుంటున్న అల్పాదాయ వర్గాలు వారుంటున్న నివాస ప్రాంతాలకు వెళ్ళి అక్కడి స్థానిక, మహిళా, యువజన సంఘాలు, డ్వాక్రా సంఘాలు, జీవిఎంసి యుసిడి కార్మికశాఖ, పోలీసుశాఖల సమన్వయంతో, కళాజాతాలు, షార్ట్ఫిల్మ్‌ల ప్రదర్శనలు జీపు జాతాలు వేలాదిగా కరపత్రాలను పంపిణీ చేస్తుండటం, సిఆర్‌పిఎఫ్‌తోపాటు ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. నిత్యం బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి, చట్టాలు, బాలలను కార్మికులుగా ప్రోత్సస్తే వారు ఎదుర్కొనే చట్ట ప్రకార చర్యలు, జైలు శిక్షలపై నగరంలో అధిక శాతం మందికి అవగతమయ్యేలా నిరంతరం శ్రమించడాన్ని నగరంలో ప్రతీ పౌరుడు ఆదర్శవంతంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సిఆర్‌పిఎఫ్‌కు కార్మికశాఖ పూర్తి సహాయ సహకారలందిస్తుందన్నారు. ఈ ఫోరంతోపాటు మిగలా బాలల సంఘాలను కలుపుకుని వెళతామన్నారు. చైల్డ్‌రైట్స్ ప్రొటక్షన్ ఫోరం నగర కన్వీనర్ గొండు శీతారాం మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థపైన విశాఖ నగరంతోపాటు జిల్లాలోను విస్తృతంగా పర్యటించిన మిగిలిన బాలల సంఘాలను కలుపుకుని వారిలో జాగృత పరిచి స్మార్ట్‌సిటీ సాదనలో తమ ఫోరం ప్రభుత్వాధికారులకు సహాయసహాకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం కో-కన్వీనర్లు పి.సత్యకుమార్, తిర్లంగి హరి, బి.శకుంతల, గంట్యాడ శంకర్రావు, కదిరి రాము, జనరల్ సెక్రటరీ వంకా మల్లేశు, కార్యదర్శి జివి కుమార్, ఇసి మెంబర్లు కె.యల్లయ్య, కనకల రామునాయుడు కరాటే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇఎస్‌ఐలోకి 9 వేల మంది ఉద్యోగులు
* షీలానగర్‌లో త్వరలో 500 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి
* కార్మిక రాజ్యబీమా సంస్థ ఏపీ సభ్యుడు రామకోటయ్య

విశాఖపట్నం, డిసెంబర్ 19: కార్మిక రాజ్య బీమా పథకాల మరింతగా విస్తరించేందుకు వీలుగా కార్మికుకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇఎస్‌ఐ కేంద్ర బోర్డు సభ్యులు చెరువు రామకోటయ్య తెలిపారు. సోమవారం డైమండ్ పార్కు సమీపానున్న హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల బీమా హిత లాభాలు, వైద్య సదుపాయం కల్పించేందుకు వీలుగా త్వరలో తొమ్మిదివేల మంది ఉద్యోగులను ఈ సంస్థలోకి తీసుకుంటున్నామన్నారు.1952లో స్థాపించిన ఇఎస్‌ఐ 64 ఏళ్ళ ప్రస్తానం కొనసాగుతుందన్నారు. కాశీ నుంచి కన్యకుమారి వరకు ఇది కార్మికులకు సేవలందిస్తుందన్నారు. 151 ప్రధాన ఆసుపత్రులు, వెయ్యి రిఫరల్ ఆసుపత్రులు ద్వారా సేవలందుతున్నాయన్నారు. ఈ విధమైన సేవలందించేందుకు 22వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య కేవంల 500 మంది వరకే ఉండేదని,అది ఇపుడు 2.5 కోట్లకు చేరుకుందని ఈ విధంగా 8.9 కోట్ల మంది కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 2.0 ఫార్ములా ప్రకారం కార్మికులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా చూస్తున్నామని, అలాగే దేశవ్యాప్తంగా 425 రకాలైన జబ్బులు గుర్తించారన్నారు.అలాగే నిర్మాణ రంగంలో ఉండేవారికి, ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులకు, 15 వేల లోపు వేతనాలు అందుకునే వారందరికీ దీని పరిధిలోకి తీసుకువస్తున్నట్టు ఆయన ప్రకటించారు. యాజమాన్యాలు తరపున 4.75 శాతం, అలాగే కార్మికుని వంతుగా 1.75 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. జీతం ద్వారా వచ్చే 6.5 శాతం కార్మికుల ఖాతాల్లో ఉంటుందన్నారు. దేశంలో 33 రాష్ట్రాల్లో సేవలందుతున్నాయన్నారు.విశాఖ నగర సమీపానున్న షీలానగర్ ప్రాంతంలో రూ.500 కోట్లతో 500 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగనుందన్నారు. ఇది వస్తే కార్మికులకు మరింతగా వైద్యపరంగా సౌలభ్యం ఉంటుందన్నారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వంద పడకల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇఎస్‌ఐ అధికారులు పాల్గొన్నారు.