విశాఖ

మన్యంలో పార్లమెంటరీ కమిటీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, డిసెంబర్ 19: అరకులోయను పార్లమెంటరీ కమిటీ సోమవారం సందర్శించింది. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ పి.వేణుగోపాల్ నేతృత్వంలో పదిహేను మంది కమిటీ సభ్యులు పలు అభివృద్ధి పను లు పరిశీలించారు. అనంతగిరి మండలంలో విస్తృతంగా పర్యటించిన కమిటీ అరకులోయ మండలం కొత్తబల్లుగుడ పంచా యతీ గద్యగుడ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేసింది. అదే విధంగా గద్యగుడ చెరువులో కమిటీ చైర్‌పర్సన్ సభ్యులు, అధికారులు కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అంతకుముందు సుం కరమెట్ట పంచాయతీకి చెందిన పలు గ్రామాల గిరిజన రైతుల కాఫీ తోటలు పరిశీలించిన కమిటీ తోటల సాగుదారులతో ముచ్చటించింది. కాఫీ సాగు వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలపై ఆరా తీసింది. గిరిజన రైతుల ఆర్థిక బలోపేతానికి తోడ్పడుతున్న కాఫీ సాగును విస్తరించాలని ఈ సందర్భంగా కమిటీ చైర్‌పర్సన్ వేణుగోపాల్, సభ్యులు సూచించారు. ఈ పర్యటనలో చెన్నై, ఢిల్లీ, ముం బాయి, హైదరాబాద్, బరంపూర్ పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ సెక్రటరీయట్ ఉన్నతాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్.ప్రేమాకరరావు, ఉపాధి హామీ పథకం అధికారులు, గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతగిరిలో
అనంతగిరి: గిరిజన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద నుంచి 150 రోజుల పని దినాలను పెం చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని పార్లమెంటరీ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ తెలిపారు. సోమవారం పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నేతృత్వంలో అనంతగిరి మం డలం కాశీపట్నం పంచాయితీ బంగారమ్మపేట, ఎగువశోభ పంచాయతీ మరదగుడ గ్రామాల్లో పర్యటించి మంచినీటి పథకాలను పరిశీలించారు. ముందుగా బంగారమ్మపేట గ్రామంలో సోలార్ విద్యుత్‌తో నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎంత వరకూ నీరందుతుంది? అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంగారమ్మ పేట గ్రామస్థులతో ఆయన మాట్లాడారు. బడిఈడు పిల్లలను బడికి పంపుతున్నారా లేదా అని అడిగారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్చించి వారి బంగారు భవిష్యత్‌కు పునాదులు వేయాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉందన్నారు. ప్రభుత్వం చిన్నారుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని పిల్లలను చదివించాలని వారు సూచించారు. అలాగే పక్కా ఇళ్ళు మంజూరు అయ్యా యా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మాణంపై ఆరా తీశారు. ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాల్నిన బాధ్యత మీ అందరిపైన ఉందన్నారు. ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి 15 వేల రూపాయలను అందిస్తుందని వారు చెప్పారు. అనంతరం అనంతగిరిలో రెండు కోట్లతో నిర్మించిన మంచినీటి పథకాన్ని వారు పరిశీలించారు. మంచినీటి పథకం ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ఫొటో ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంచినీటి పథకం ఆవరణలో కమిటీ సభ్యుల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ముంబాయ్, డిల్లీ, బరంపురం, హైదరాబాద్ చెందిన ఎంపీలు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, నీటి పారుదల సి.ఎస్.రవిబాబు, ఎస్.ఇ. ప్రభాకరరావు, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పి.డి. కళ్యాణ చక్రవర్తి, డి.ఆర్.డి.ఎ. పి.డి సత్యసాయి శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొట్యాడ అప్పారావు, అనంతగిరి ఎంపీపీ గుజ్జెల పైడితల్లి, ఎంపీడీఓ రమేష్‌రామన్, తహశీల్దార్ రాణీ అమ్మాజీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాక్సైట్ జీవోను రద్దు చేయాలి
అనంతగిరి మండలంలో పర్యటించిన పార్లమెంటరీ కమిటీ సభ్యులకు స్థానిక సి.పి.ఎం. నాయకులు గంగరాజు, మొస్యా, నాగులు బాక్సైట్ జీవోను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, అనంతగిరి జూనియర్ కళాశాలలో అదనపు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.