విశాఖ

జిల్లాలో పలు శాఖల ప్రగతి మెరుగుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 20: జిల్లాలో పలు శాఖల ప్రగతి మెరుగుపడాల్సి ఉందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా అధికారులతో శాఖలవారీగా పురోగతిపై సమీక్షించారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించడంలో ఆలస్యవౌతోందని ఎస్సీ కార్పోరేషన్ ఇడి మహాలక్ష్మీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
మండల కమిటీలు పూర్తయ్యాయని, లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైందని, అయితే జీవీఎంసి పరిధిలో అన్ని జోన్లకు కలపి ఒకే లాగిన్ ఇచ్చారని, వేర్వేరుగా ఇవ్వాలని కమిషనరేట్‌కు నివేదించామని ఇడి వివరించారు.
త్వరగా కమిటీలను వేసి లబ్ధిదారులను వెంటనే గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
గృహ నిర్మాణ శాఖ గ్రౌండింగ్‌లు ఆలస్యవౌతున్నాయని, క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, సంయుక్త కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచనలు జారీ చేయాలన్నారు.
అదేవిధంగా హుదూద్ గృహాలు కూడా ఆలస్యవౌతున్నాయని, గృహ నిర్మాణ శాఖకు ప్రణాళికలేదని, ప్రగతిలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, నిధులకోసం లేఖ రాసి, వెంటనే చెల్లింపులు చేయాలని జిల్లావిద్యాశాఖాధికారి ఎంవి కృష్ణారెడ్డికు సూచించారు.11 ఏజెన్సీల్లో కేజీబీవీలకు నిధులు లేవని, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులను మంజూరు చేయాలని సర్వశిక్షా అభియాన్ పిఒ శివరాం ప్రసాద్ కలెక్టర్‌ను కోరగా, ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమలు, రెండెంకెల వృద్ధి, భూ వివాదాలు, దీపం గ్యాస్ కనెక్షన్లు, వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణ నీటిసరఫరా, విద్యుత్ తదితర శాఖల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి.సృజన, జిల్లా అధికారులు హాజరయ్యారు.